Visakha: విశాఖ ఆరుగురు హత్య కేసులో కొత్త ట్విస్ట్

A New Twist in the Visakha Six murder Case
x

Visakha:(File Image) 

Highlights

Visakha: వివాహేతర సంబంధమే హత్య కారణమని పోలీసులు తేల్చారు

Visakha: పెందుర్తి లో జరిగిన ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య చేసిన కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. సినిమాలను తలపించే ఉత్కంఠ.. విచారించే కొద్దీ కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆస్తి తగాదాలే హత్యకు కారణం అనుకున్నారు. కానీ, ఇప్పుడు అంతకుమించిన అంశం తెరపైకి వచ్చింది. ఆరుగురిని హత్య చేయడంలో అప్పలరాజు వ్యూహాత్మకంగా వ్యవహారించాడు. వివాహేతర సంబంధంతోనే ఈ హత్యకు దారి తీసినట్టు పోలీసులు తేల్చారు.

వివాహేతర సంబంధం...

నిందితుడు అప్పలరాజు కుమార్తెతో మృతుడు విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు తేల్చారు. 2018లో తన కుమార్తెతో చాటింగ్‌ చేస్తున్నట్టు అప్పలరాజు గుర్తించాడు. దాంతో 2018లో విజయ్ పై అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో విజయ్‌ని పోలీసులు అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి విజయ్ కుటుంబంపై అప్పలరాజు కక్ష పెంచుకున్నాడు.

2018లోనే అప్పలరాజు విజయ్ ఫ్యామిలి మీద దాడి ...

ఆ కక్ష్యతో కుటుంబం మొత్తాన్ని అప్పలరాజు హత్య చేశాడు. విజయ్ తండ్రి రామారావు సహా ఇతర కుటుంబ సభ్యుల్ని అప్పలరాజు చంపేశాడు. 2018లోనే అప్పలరాజు విజయ్ ఫ్యామిలి మీద దాడి చేశాడు. ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో తప్పించుకున్నాడు. ఇరు కుటుంబాల్లో ఏర్పడిన గొడవలతోనే 4 నెలల క్రితం విశాఖ నుంచి బెజవాడకు వెళ్లిపోయింది విజయ్ ఫ్యామిలి. అయితే ఇటీవల ఒక శుభాకార్యం కోసం విశాఖ పెందుర్తికి వచ్చింది విజయ్ ఫ్యామిలి. తెల్లవారుజామున 4గంటల సమయంలో ఇంట్లోకి చొరబడి చిన్నపిల్లలను కూడా చూడకుండా విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. మృతులు బొమ్మిడి రమణ(63), బొమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(37), ఉషారాణి పిల్లలు బొమ్మిడి ఉదయ్‌(2), బొమ్మిడి ఉర్విష(6 నెలలు)గా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories