అధిక పాల దిగుబడే లక్ష్యంగా సాగుతున్న రైతు

అధిక పాల దిగుబడే లక్ష్యంగా సాగుతున్న రైతు
x
Highlights

వ్యవసాయంతో పాటు సమానంగా పాడి పరిశ్రమ రైతులకు చేయూతనిస్తుంది. అనాది నుంచి రైతులు తమ వ్యవసాయ పనులకు పశుసేవలు ఉపయోగించుకంటున్నారు. అయితే పాడి పరిశ్రమగా...

వ్యవసాయంతో పాటు సమానంగా పాడి పరిశ్రమ రైతులకు చేయూతనిస్తుంది. అనాది నుంచి రైతులు తమ వ్యవసాయ పనులకు పశుసేవలు ఉపయోగించుకంటున్నారు. అయితే పాడి పరిశ్రమగా మార్చుకున్న కొంత మంది రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు. ఆ విధంగానే ఈ రంగంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు హైదరాబాద్ కు చెందిన రైతు సీతారాం చౌదరి.

హైదరాబాద్, నాగారం కు చెందిన సీతారాం చౌదరిది పాడి పరిశ్రమలో ఐదేళ్ల అనుభవం. ఎప్పటికప్పుడు మెళకువలు నేర్చుకుంటూ అధిక దిగుబడినిచ్చే పశువులను కొనుగోలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. షెడ్ నిర్మాణం, పరిశుభ్రత, మేత, పాల దిగుబడి, మార్కెటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీతారాం చౌదరి లాభదాయకంగా ముందుకు సాగుతున్నారు. మొదట్లో తక్కవ మొత్తంలో పశువులతో మెదలు పెట్టి ఉన్నా క్రమక్రమంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం సీతారాం ఫామ్‌లో ఆవులు, గేదేలు కలిపి 25 దాకా ఉన్నాయి. ఉన్న వాటిలో ఎక్కువ మొత్తంలో సూడి గేదెలు ఉండటంతో ముందు రోజుల్లో పాల దిగుబడి ఎక్కవగా వస్తుందని సీతారాం చౌదరి చెప్తున్నారు.

పాడి పరిశ్రమ అంటే పాల దిగుబడితో లాభాలు ఆశించడమే కాకుండా దూడలను శ్రద్ధగా పెంచి వాటి ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చంటారు సీతారాం చౌదరి. కొత్తగా డెయిరీ పెట్టాలనుకునే రైతులు ఒకేసారి పెద్దమొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో, సరైన అవగాహనతో మొదలు పెడితే లాభాలు ఆర్జించవచ్చని సాటి రైతులకు చెప్తున్నారు.

సాధారణంగా పాడి పరిశ్రమ అంటే చాలా మంది రైతులు అంతగా ఆసక్తి చూపరు. కాని ముందుగా కొద్ది పశువులతో పాడి పరిశ్రమను మొదలుపెడితే ఈ రంగంలో రైతులు ఎదగడానికి అవకాశం ఉంటుంది. దాణా స్థానంలో సొంత పొలంలో గడ్డిని పెంచుకుంటే ఖర‌్చు తగ్గటంతో పాటు మొదట్లోనే ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. డెయిరీ ఫాం నిర్వహించే రైతులు ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్త షెడ్‌ లను శుభ్రంగా ఉంచటం. అదే విధంగా పశువులకు దాణా, నీటి విషయంలో చక్కటి పద్ధతులు పాటిస్తే అధిక పాల దిగుబడులతో పాటు లాభాలూ గడించవచ్చు. అదే క్రమంలో అవగాహ‍న లేకుండా పాడి పెంపకం వైపు అడుగులు వేస్తే నష్టాలు చవి చూసే ప్రమాదమూ ఉంది.

షెడ్‌ను శుభ్రంగా ఉంచడం ద్వారా పశువులలో వచ్చే కొన్ని జబ్బులను దూరం ఉంచవచ్చు. ఒకటి, రెండింటికి పరిమితం కాకుండా ఎక్కువ రకాల గేదెలు, ఆవులను తన ఫామ్ లో ఉంచారు సీతారాం చౌదరి. మంచి మేత ద్వారానే ఆధిక దిగుబడి వస్తుందని చెప్తున్న సీతారాం చౌదరి తానే స్వయంగా గ్రాసాలను సాగు చేస్తున్నారు దీని ద్వారా దిగుబడి పెంచుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ క్రమంలో ముందుకు వెళ్తున్న ఈ రైతు నష్టం అన్న మాటలేదని చెప్తున్నారు. తన డైయిరీ ఫామ్ లో ఉన్న పశువులకు మేతగా సొంతంగా తాము సాగు చేసిన గ్రాసానే అందిస్తున్నామని అంటున్నారు ఈ రైతు. అందుకోసం సూపర్ నేపియార్ వంటి మేళైన గడ్డిని సాగు చేస్తున్నారు, అంతేకాకుండా అదనపు ఆదాయంగా కోళ్లు, మేకలను పెంచుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories