జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్‌..

జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్‌..
x
Highlights

కొత్త ఏడాది రాకముందే ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.

కొత్త ఏడాది రాకముందే ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో మళ్లి ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో మొబైల్ నెట్‌వర్క్‌కు ఫోన్ చేసినప్పుడు ఇన్ కమింగ్ నెట్‌వర్క్‌కు కాల్‌ చేసిన నెట్‌వర్క్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జెస్‌ అంటారు. ఈ విధానాన్ని జనవరి 1 2020 నుంచి తొలగించడానికి కేంద్రం సమ్మతించింది. అయితే ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా దీన్ని వ్యతిరేకించడంతో పొడగిస్తూ 2019 సెప్టెంబరులో ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఈ రోజుతో ఐయూసీ అమలు గడువు ముగుస్తుండటంతో జియో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను పునరుద్ధరిస్తామని గతంలో చెప్పినట్లు జియో ప్రకటించింది. 1, 2021 నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా జియో ద్వారా ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు అని ప్రకటించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories