Health Benefits with Mosambi: బత్తాయితో ఆరోగ్య ప్రయోజనాలు...

Health Benefits with Mosambi: బత్తాయితో ఆరోగ్య ప్రయోజనాలు...
x
Highlights

బత్తాయి (Orange fruit) ఒక తియ్యని రూటేసి కుటుంబానికి సంబంధించిన పండ్ల చెట్టు. చూడటానికి పెద్ద నిమ్మపండు లా కనిపించినా రుచి మాత్రం తీయగా ఉంటుంది.

బత్తాయి (Orange fruit) ఒక తియ్యని రూటేసి కుటుంబానికి సంబంధించిన పండ్ల చెట్టు. చూడటానికి పెద్ద నిమ్మపండు లా కనిపించినా రుచి మాత్రం తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్ లైమ్ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది. దీన్ని కొద్ది మంది ఒలుచుకుని తింటారు కానీ చాలా మంది దీన్ని రసం రూపంలో సేవిస్తారు.

ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా, మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ పండ్ల చెట్లని ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. పుట్టింది ఆసియా దేశాల్లోనే అయినా క్రమంగా ఇటలీ, మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా పండిస్తున్నారు.

బత్తాయిలతో ఆరోగ్యం...

పోషక విలువలతోబాటు ఔషధ పరంగా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు, జ్వరం వచ్చినపుడు త్వరగా కోలుకోవడానికి దీన్ని రసాన్ని ఇస్తారు.

* విటమిన్-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండు బాగా పనిచేస్తుంది.

* ఈ పండుకున్న తీపి వాసన లాలాజల గ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా ఊరేందుకు కారణమవుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు పిత్తరసంతోపాటు ఇతర జీర్ణరసాలు, ఆమ్లాలు విడుదలయ్యేందుకు దోహద పడతాయి. అందువల్ల తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా ఈ రసం తొందరగా జీర్ణమై రక్తంలో కలిసిపోతుంది.

* ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాల్ని పారదోలుతాయి.

* ఈ జ్యూస్ వల్ల చిగుళ్ళ నొప్పులు, గొంతు సంబంధ ఇన్‌ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.

* బత్తాయి రసం చర్మానికి కూడా మంచిదే. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మచ్చల్ని మాయం చేస్తుంది.

బత్తాయి పండు యొక్క పోషక విలువలు...

తక్కువ క్యాలరీలు మరియు తక్కువ కొవ్వుల్ని కల్గిన బత్తాయిలు అద్భుతాలే చేస్తాయి. బత్తాయి పండును చిన్న మొత్తాలలో తింటే 43 కేలరీలు లభిస్తాయి మరియు కేవలం 0.3 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటాయి. వైద్యపరంగా, బత్తాయిలు పొటాషియం మరియు విటమిన్ సి యొక్క గొప్ప మూలం, ఈ పండు శరీరాన్ని చల్లబరుస్తుంది. కార్బోహైడ్రేట్లను కూడా కలిగిఉన్న బత్తాయిలు క్యాలరీలకు ప్రధానమైన మూలం.

100 గ్రాముల బత్తాయి లో ఉండే పోషక విలువలు..

* నీరు : 90.79 గ్రా

* శక్తి : 25 గ్రా

* ప్రోటీన్ : 0.42 గ్రా

* కొవ్వు (ఫ్యాట్) : 0.07 గ్రా

* కార్బోహైడ్రేట్ : 8.42 గ్రా

* ఫైబర్ : 0.4 గ్రా

* చెక్కెర : 1.69 గ్రా

* కాల్షియమ్ : 14 mg

ఐరన్ : 0.09 mg

* మెగ్నీషియం : 8 mg

* ఫాస్పరస్ : 14 mg

* పొటాషియం : 117 mg

* సోడియం : 2 mg

* జింక్ : 0.08 mg

* విటమిన్ B1 : 0.025 mg

* విటమిన్ B2 : 0.015 mg

* విటమిన్ B3 : 0.142 mg

* విటమిన్ B6 : 0.038 mg

* విటమిన్ B9 : 10 µg

* విటమిన్ సి : 30.0 mg

* విటమిన్ ఎ : 2 µg

* విటమిన్ ఇ : 0.22 mg

* విటమిన్ కె : 0.6 µg

Show Full Article
Print Article
Next Story
More Stories