
ఉప్పెన సినిమాలో ఓ సీన్ (ఫైల్ ఫోటో)
కొత్త సినిమా అంటే ఎదురుచూపులు.. అంచనాలు సహజం. అయితే, ఇటీవల సినిమాలో ఒక్క సీన్ ఎలా తీశారు అనే అంశం కోసమే యావత్తు టాలీవుడ్ ఎదురుచూసింది. ఆ సినిమా...
కొత్త సినిమా అంటే ఎదురుచూపులు.. అంచనాలు సహజం. అయితే, ఇటీవల సినిమాలో ఒక్క సీన్ ఎలా తీశారు అనే అంశం కోసమే యావత్తు టాలీవుడ్ ఎదురుచూసింది. ఆ సినిమా 'ఉప్పెన'. ఆ సీన్ కటింగ్ సీన్.
సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి ఆసక్తి రేకెత్తించేవి కొన్ని ఉంటాయి. పాటలు విన్నాకా అంచనాలు ఏర్పడేవి కొన్నుంటాయి. ట్రైలర్ వచ్చాకా ఒకసారి సినిమా చూడాల్సిందే అనిపించేలా మరి కొన్ని సినిమాలు ఉంటాయి. కానీ, 'ఉప్పెన' సినిమా మాత్రం ఎనౌన్స్ చేసిన దగ్గరనుంచీ తెలుగు సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ ఆసక్తి ట్రైలర్ తో అంచనాల 'ఉప్పెన' గా మారింది.
ట్రైలర్ వచ్చిన వెంటనే.. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సెలబ్రిటీ సినిమాలో ఒక సీన్ గురించే మాట్లాడుకుంటూ వచ్చారు. అదే క్లైమాక్స్. అదేవిధంగా క్లైమాక్స్ గురించి ఇంత మంది మాట్లాడుతుండడంతో సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు.. ఆసక్తి విపరీతంగా పెరిగిపోయాయి.
ఇన్ని అంచనాల మధ్యలో ఈరోజు (ఫిబ్రవరి 12) సినిమా విడుదల అయ్యింది. అయితే, మనకంటే ముందుగా గత రాత్రి ఓవర్సీస్లో ఉప్పెన షోస్ నడిచాయి. ఈ షోస్ చూసిన ప్రతి ఒక్కరూ ఆ ఒక్క సీన్ గురించే మాట్లాడుతున్నారు. ట్విట్టర్ లో ఈ సిన్ గురించిన కామెంట్లు.. ఈ సీన్ కు సంబంధించిన విశేషాలే కనిపిస్తున్నాయి. అదేవిధంగా సినిమా హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్- కృతి శెట్టి ల నటన గురించి.. వారిమధ్య కుదిరిన కెమిస్ట్రీ గురించి విపరీతంగా పొగుడుతున్నారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభ మరో లెవెల్ లో ఉందని అంటున్నారు.
ఇంత ఆసక్తి రేపి.. అందరినీ ఆకట్టుకుని.. కంటతడి పెట్టించిన ఆ సీన్ ఏమిటనేది రివీల్ చేయలేకపోయినా.. ఉప్పెన సినిమాలో ఆ సీన్ తీసిన విధానం మాత్రం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
Cinema ela undhi anedhanikanna Cut undha ledha ani discos pedthunnaru ga ra ayya 🤣🤣🤣 #Uppena finally ela undhi ra cinema ???
— Gowtham Murari 🇮🇳 (@murarigowtham) February 12, 2021
#Uppena https://t.co/YrS6V3sKOV
— Tony alpacino (@tonyaplacino) February 12, 2021

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire