Paagal Review: విశ్వక్ సేన్ "పాగల్" మూవీ రివ్యూ

Vishwak Sen Paagal Telugu Movie Review and Rating
x

పాగల్ మూవీ రివ్యూ 

Highlights

Paagal Review: విశ్వక్ సేన్ తాజాగా "పాగల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

చిత్రం: పాగల్

నటీనటులు: విశ్వక్ సేన్, నివేథా పెతురాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ, భూమిక చావ్లా, మురళి శర్మ తదితరులు

సంగీతం: రాధన్

సినిమాటోగ్రఫీ: ఎస్ మణికందన్

ఎడిటింగ్‌: గ్యారీ బి హెచ్

నిర్మాత: బెక్కెం వేణుగోపాల్

దర్శకత్వం: నరేష్ కుప్పిలి

బ్యానర్: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ లక్కీ మీడియా

విడుదల: 14/08/2021

ఈ మధ్యనే "హిట్" సినిమాతో మంచి విజయాన్ని సాధించిన విశ్వక్ సేన్ తాజాగా "పాగల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నరేష్ కుప్పిలి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి మరియు మేఘా లేఖ లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. సీనియర్ నటి భూమిక చావ్లా క్యామియో పాత్రలో కనిపించిన ఈ సినిమాని వేణుగోపాల్ నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు టీజర్ మరియు ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని అర్థమవుతుంది. ఇప్పటిదాకా యాక్షన్, మాస్ లుక్ లతో మెప్పించిన విశ్వక్సేన్ తన రొమాంటిక్ యాంగిల్ తో అందరి దృష్టిని ఆకర్షించబోతున్నాడు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఇవాళ అనగా ఆగస్టు 14, 2021 న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా..

కథ:

ప్రేమ్ (విశ్వక్ సేన్) ఏడేళ్ళ వయసులోనే తన తల్లి (భూమిక చావ్లా) ను కోల్పోతాడు. తల్లి ప్రేమ కోసం పరితపిస్తున్న ప్రేమ్ కు తన స్నేహితులు ఒక మంచి అమ్మాయిని ప్రేమించమని, ఆ అమ్మాయి తనను తల్లిగా చూసుకుంటుందని సలహా ఇస్తారు. అప్పటి నుంచి దాదాపు 1600 మంది అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తాడు ప్రేమ్. కానీ అందులో ఏ ఒక్కరు కూడా అతని ప్రేమను అంగీకరించరు. దీనితో జీవితంపై విసుగు చెందిన ప్రేమ్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే తన జీవితంలోకి తీరా (నివేదా పేతురాజ్) వస్తుంది. అప్పటికే నిశ్చితార్థం అయిపోయినప్పటికీ, తీరా ప్రేమ్ కు ప్రపోజ్ చేస్తుంది. చివరికి వీళ్ళిద్దరూ కలిసారా లేదా? వారి కథ ఏమైంది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే విశ్వక్ సేన్ ఈ సినిమాలో విభిన్నంగా కనిపించాడని చెప్పుకోవాలి. యంగ్, రొమాంటిక్ పాత్రలో విశ్వక్ సేన్ చాలా బాగా నటించాడు. విశ్వక్ సేన్ తన పాత్రలో ఒదిగిపోయి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. నివేతా పేతురాజ్ ఈ సినిమాలో అందంతో మాత్రమే కాక నటనతో కూడా చాలా బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ తో తన కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. సిమ్రాన్ చౌదరి మరియు మేఘా లేఖ కు కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. భూమిక చావ్లా కు సినిమాలో కీలక పాత్ర దొరికింది. ఆ పాత్రకు పూర్తి న్యాయం సమకూర్చారు చేశారు భూమిక. హీరోయిన్ తండ్రి పాత్రలో మురళి శర్మ కూడా బాగానే ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

మొదటి సినిమా అయినప్పటికీ నరేష్ తన నెరేషన్ తో బాగానే ఆకట్టుకున్నారు. సినిమా మొత్తం మీద మిగతా అన్నిటికంటే ఎమోషన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీట వేశారు. అయితే అన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ సన్నివేశాలు బాగానే అనిపించినప్పటికీ కొన్ని సన్నివేశాలు మాత్రం బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు లక్కీ మీడియా అందించిన నిర్మాణ విలువలు సినిమాకి బాగానే ప్లస్ అయ్యాయి. రాధన్ అందించిన పాటలు చాలా బాగున్నాయి. అందులోనూ రెండు పాటలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి అని చెప్పుకోవచ్చు. లియోన్ జేమ్స్ అందించిన నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. కెమెరామెన్ గా మణికందన్ మంచి విజువల్స్ అందించారు. ఎడిటింగ్ కూడా బాగుంది.

బలాలు:

* విశ్వక్ సేన్ నటన

* ఫస్ట్ హాఫ్ లోని కామెడీ సన్నివేశాలు

* రెండు పాటలు

బలహీనతలు:

* సెకండ్ హాఫ్

Show Full Article
Print Article
Next Story
More Stories