Top
logo

Ravi Teja New Movie: "క్రాక్" ఫార్ములాని వాడబోతున్న "రామారావు ఆన్ డ్యూటీ"

In Rama Rao on Duty Movie Ravi Teja Will Act in Mass Character like Same as Krack Movie
X

రవి తేజ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* శరత్ మండవ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు * దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది

Rama Rao on Duty - Ravi Teja: వరుస డిసాస్టర్ లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు ఈ సంవత్సరం మొదట్లో "క్రాక్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రవితేజ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించగా, శృతిహాసన్ ఒక బిడ్డ తల్లిగా మరియు రవితేజ భార్య పాత్రలో చాలా బాగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా మారింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు "క్రాక్" సినిమా ఫార్ములా రవి తేజ తదుపరి సినిమా "రామారావు ఆన్ డ్యూటీ" లో కూడా ఉపయోగించనున్నారట. ఈ సినిమాలో కూడా రవితేజ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ కి ఒక భార్య మరియు కొడుకు ఉంటారట. మరోవైపు "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా ఎమోషనల్ గా నడుస్తుందని తెలుస్తోంది.

దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ మండవ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. రవితేజ ఈ సినిమాలో ఒక గవర్నమెంట్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు.

Web TitleIn Rama Rao on Duty Movie Ravi Teja Will Act in Mass Character like Same as Krack Movie
Next Story