MAA Elections 2021: రసవత్తరంగా 'మా' ఎన్నికలు

MAA Elections 2021 Nominations are From 27 September to 29 September | Tollywood News Today
x

'మా' ఎన్నికలు 

Highlights

MAA Elections 2021: * తన ప్యానల్ ప్రకటించిన మంచు విష్ణు * వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్ పోటీ

MAA Elections: ఎప్పటిలాగే ఈ సారి మా ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడానికి ఈసారి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవిఎల్ నరసింహారావు పోటీలో ఉన్నారు. అయితే అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ మెంబర్స్‌ని ప్రకటించగా తాజాగా 'మా' కోసం మనమందరం అంటూ మంచు విష్ణు తన ప్యానెల్‌ను ప్రకటించారు.

మంచు విష్ణు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే ఆలస్యంగా ప్యానెల్ ప్రకటించాడు. అధ్యక్షుడిగా మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్, ఉపాధ్యక్షులుగా మాదల రవి, పృథ్వీరాజ్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజ్, ట్రెజరర్ గా శివబాలాజీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఇక కార్యవర్గ సభ్యులుగా అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మేర్లపాక శైలజ, పూజిత, రాజేశ్వరిరెడ్డి, రేఖ, సంపూర్ణేశ్ బాబు, తదితరులు పోటీలో చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్యానెల్‌కి నరేష్ సపోర్ట్ కూడా ఉంది. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరిని వ్యూహాత్మకంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.

మంచు విష్ణు తన విజయానికి కొన్ని అంశాలు కలిసోస్తాయనే నమ్మతున్నాడు. మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలు, సీనియర్ హీరోల ఆశీస్సులు ఉన్నాయి. ముఖ్యంగా 'మా' బిల్డింగ్‌తో పాటు 'మా' సంక్షేమం గురించి కూడా సభ్యులతో చర్చించడం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. కేవలం 956 మంది సభ్యులున్న మా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇక ఈనెల 27 నుంచి 29 వరకూ నామినేషన్స్ స్వీకరిస్తారు. అక్టోబర్ 10న జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories