Akhanda Movie Updates:'అఖండ'లో హైలైట్ ఏంటో తెలుసా?

Nandamuri Balakrishna Akhanda Movie Highlights
x

అఖండ మూవీ పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Akhanda Movie Updates: బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 'అఖండ' సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది

Akhanda Movie Updates: బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 'అఖండ' సినిమా చిత్రీకరణపరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు టీజర్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాళ్లంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు

సినిమాలో రైతుగా .. అఘోరగా బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. అయితే అఘోర పాత్ర ఎలా ఉంటుందా అనే సందేహం అభిమానుల్లో ఉంది. ఈ పాత్రను బోయపాటి చాలా ఉన్నతంగా తీర్చిదిద్దినట్టుగా చెబుతున్నారు. ఈ పాత్రల్లో బాలకృష్ణ చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ కి విజిల్స్ వర్షం కురుస్తుందని అంటున్నారు. బాలకృష్ణ ఈ పాత్రలో కనిపించడానికి గల కారణం చాలా బలంగా ఉంటుందనీ, అది ఆడియన్స్ ను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటిస్తున్న ఈ సినిమాను, దసరాకు విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ టీజర్ 40 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి గత రికార్డులను తిరిగరాసింది. ఈ సినిమా దెబ్బకు పాత రికార్డులు కూడా చెదిరిపోతున్నాయి. బాలయ్యకు జోడీగా కంచె బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories