Breaking News: పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌.. ఆక్సిజన్ అందిస్తూ వైద్యం చేస్తున్న..

Pawan Kalyan Tests Positive for Coronavirus
x

Breaking News: పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్

Highlights

Breaking News: జనసేనాని పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌‌గా తేలింది.

Breaking News: జనసేనాని పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌‌గా తేలింది. రెండ్రోజులక్రితం కోవిడ్ పరీక్షలు చేయించుకున్న పవన్‌‌కు కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. దాంతో, పవన్ కల్యాణ్ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అపోలో ఆస్పత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స జరుగుతోంది. పవన్‌ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తోపాటు నిమ్ము చేరడంతో ఆక్సిజన్ అందిస్తూ ప్రత్యేక వైద్య బృందం ట్రీట్‌మెంట్ అందిస్తోంది. ఇక, పవన్ జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పవన్ ఫామ్‌హౌస్‌లో‌ చికిత్స జరుగుతోంది.

ఈనెల 3న తిరుపతి సభ తర్వాత పవన్‌ అస్వస్థతకు గురికావడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అయితే, అప్పుడు కరోనా నెగిటివ్ రావడంతో ముందుజాగ్రత్తగా అప్పట్నుంచి హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ వచ్చారు. అయితే, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండటంతో రెండ్రోజులక్రితం మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఈసారి పాజిటివ్ రావడంతో వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.

కోవిడ్ బారినపడిన పవన్ కల్యాణ్‌ను పలువురు ప్రముఖులు ఫోన్లో పరామర్శిస్తున్నారు. చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన, ఇతర కుటుంబ సభ‌్యులు ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ట్రీట్‌మెంట్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో ప్రముఖ కార్డియాలజిస్ట్‌గా ఉన్న డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స జరుగుతోంది. పవన్ ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో యాంటివైరల్ మెడిసిన్స్ ఇస్తున్నారు. అలాగే, జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories