Anubhavinchu Raja Teaser: "అనుభవించు రాజా" టీజర్ విడుదల చేసిన రామ్ చరణ్

Raj Tarun Anubhavinchu Raja Movie Teaser Released by Ram Charan Today 23 09 2021
x

 నేడు "అనుభవించు రాజా" టీజర్ విడుదల (ఫైల్ ఫోటో )

Highlights

* పోస్టర్ చూస్తే ఈ సినిమా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని అర్థమవుతుంది

Anubhavinchu Raja Teaser: ఈ మధ్యనే "పవర్ ప్లే" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ హీరో రాజ్ తరుణ్ ఆ సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడు. తాజాగా ఇప్పుడు "అనుభవించు రాజా" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శ్రీనివాస్ గావిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో అజయ్, కృష్ణ మురళి పోసాని, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సుదర్శన్, అరియానా మరియు ఆదర్శ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

పోస్టర్ చూస్తే ఈ సినిమా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని అర్థమవుతుంది. ఇక చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ నేడు విడుదల చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories