Dr. Ram Charan: రామ్ చరణ్ కి అరుదైన గౌరవం.. ఇకపై డాక్టర్ రామ్ చరణ్..!
Ram Charan: గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఇటు పర్సనల్ లైఫ్ ని అటు ప్రొఫెషనల్ లైఫ్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వాహ్ అనిపించుకుంటున్నాడు.
Ram Charan: గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఇటు పర్సనల్ లైఫ్ ని అటు ప్రొఫెషనల్ లైఫ్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వాహ్ అనిపించుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ తేజ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’తో విశేష ఆదరణ సొంతం చేసుకున్న రామ్చరణ్ తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకున్నారు. అదేమిటంటే ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయబోతున్నారు.
చెన్నైకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈమేరకు ఏప్రిల్ 13న జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కళా రంగానికి చరణ్ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నట్లు స్థానిక ప్రతికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా పూర్తయిన తరువాత ఆర్సీ 16 బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire