Republic Movie Trailer: సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ట్రైలర్ విడుదల

Republic Movie Trailer: హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు

admin1
Updated on: 8 Oct 2021 5:35 PM IST
Hero Sai Dharam Tejs Republic Movie Trailer Released by Chiranjeevi | Tollywood News Today
X

రిపబ్లిక్ ట్రైలర్ విడుదల (ఫైల్ ఇమేజ్)

Republic Movie Trailer: హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. రిపబ్లిక్‌ మూవీకి దేవకట్టా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాయితేజ్‌ కలెక్టర్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేశ్‌ నటించారు. అక్టోబర్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

ఇందులో కలెక్టర్‌ పాత్రలో సాయి చెప్పే డైలాగ్‌లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. సమాజంలో తిరిగే అర్హతే లేని గూండాలు పట్టపగలే బాహటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే.. కంట్రోల్‌ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయ్‌ అంటూ సాయిధరమ్ తేజ్ చెప్పే డైలాగ్‌లు మెప్పించేలా ఉన్నాయి. మరోవైపు రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.


admin1

admin1

Next Story