వరుణ్ తేజ్ 'గని' ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ రిలీజ్

వరుణ్ తేజ్ గని ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ రిలీజ్
x
Highlights

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించిన చిత్రం ‘గని’.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించిన చిత్రం 'గని'. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.

అల్లు అరవింద్‌ సమర్పణలో రెనాయిసెన్స్‌ పిక్చర్స్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌పై సిద్ధు ముద్ద, అల్లుబాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'గని' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. సినిమాలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌ పాత్రలో కనిపించనున్నట్లు ఫస్ట్‌లుక్‌లో ఆ విషయాన్ని రివీల్‌ చేశారు. ఈ ఏడాది జూలైలో సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జార్జ్‌ సి.విలియమ్స్‌ సినిమాటోగ్రఫీ అందించనుండగా... తమన్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌ శెట్టి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మెగా కుటుంబం నుంచి హీరోగా వెండితెరపై ఆరంగేట్రం చేసినప్పటికీ వరుణ్ తేజ్ విలక్షణ కథలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ నటన కనబర్చుతున్నాడు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులతి పాటు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories