శశికళకు అస్వస్థత.. బెంగళూరు ఆస్పత్రికి తరలింపు

శశికళకు అస్వస్థత.. బెంగళూరు ఆస్పత్రికి తరలింపు
x

శశికళ ఫైల్ ఫోటో 

Highlights

తమిళనాడు దివంగత ముఖ‌్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అస్వస్థతకు గురయ్యారు.

తమిళనాడు దివంగత ముఖ‌్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అస్వస్థతకు గురయ్యారు. దీంతో బెంగళూరులోని సెంట్రల్‌ జైలులో ఆమె జ్వరం, వెన్నునొప్పితో బాధపడడంతో జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి నుంచి శ్వాసతీసుకోవడంలో.. ఇబ్బంది పడడతో.. ఆమెకు ర్యాపిడ్ యాంటిజెన్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా తేలింది. అయితే, మరింత కచ్చితత్వం కోసం ఆమెకు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేసినట్టు సమాచారం. మరికొద్ది గంటల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది.

శశికళ ఆరోగ్య పరిస్థితి గురించి జైలు అధికారులు ఆమె లీగల్‌ టీంకు సమాచారం ఇచ్చారు. అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు నుంచి ఈ నెల 27న విడుదల కానున్నట్ట్టు ఆమె తరఫు న్యాయవాది రాజా సెంథూరపాండియన్‌ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. జైలులోని ఆస్పత్రిలో చేరే సమయంలో ఆమె రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండటంతో కరోనా సోకి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తంచేసినట్టు సమాచారం. దీంతో ఆమెను బెంగళూరులోని బోరింగ్ ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories