బాబోయ్ ఇవేమి ఎండలు ... బీకేర్ ఫుల్

These Precautions Should be Followed in Summer
x

ఫైల్ ఇమేజ్


Highlights

ఎండాకాలం అరంభంలోనే ఫామ్ లోకి వచ్చిన సూర్యుడు అందరినీ బెంబేలెత్తిస్తున్నాడు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అపుడే సూర్యుడు ఫామ్ లోకి వచ్చేసి అందరినీ బెంబేలెత్తిస్తున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఇంత ఎండలు వుంటే ముందు ముందు ఎలా తట్టుకోవాలో ఏమోఅర్థం కావడం లేదండి అంటున్నారు మన కొలీగ్స్. వాతావరణ శాఖ తెలిపనట్లుగా గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్తే.. కరోనా సోకుతుందో లేదో తెలీదుగానీ వడదెబ్బ తగలడం మాత్రం పక్కా. సాధారణంగా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, చిన్నారులు, క్రీడాకారులు, గర్భిణీలు, బాలింతలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, స్థూలకాయులు, మద్యం ఎక్కువగా తాగేవాళ్లు, అతిగా ఔషదాలు తీసుకొనేవారు సైతం జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో ఎక్కువ సేపు ఎండలో పనిచేసే కూలీలు, కార్మికులు, ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాల్టి మన హెచ్ ఎం టి "లైఫ్ స్టైల్" లో చూద్దాం...

వడదెబ్బ ఎలా తగులుతుంది...

చాలామంది బయట తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తారు. అయితే, ఇంట్లో కుర్చున్నవారికి కూడా వడదెబ్బ తగులుతుంది. ఇంట్లో ఎక్కువ వేడి, ఉక్కపోత ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే..జ్వరం వస్తుంది. మీ శరీర ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్‌ హీట్‌‌కు పెరిగితే వడదెబ్బకు గురైనట్లు గుర్తించాలి. శరీరంలో నీటి శాతం లోపిస్తుంది. నీరసంగా అనిపిస్తుంది. కొందరికి కళ్లు లాగడం, మరికొందరికి తలనొప్పి వస్తుంది. వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటే వాంతులు, విరేచనాలు అవడంతో పాటు శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. దాహం ఎక్కువగా ఉండటంతో తల తిరగడం, మతి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ కాలంలో దాడిచేసే వ్యాధులు...

చికెన్‌ఫాక్స్‌: వయస్సులో తేడా లేకుండా అందరికీ సోకే వ్యాధి ఇది. ముఖ్యంగా చిన్న పిల్లలు అధికంగా ఈ వ్యాధి బారిన పడతారు. గాలి ద్వారా వచ్చే ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి సోకుతుంది. శరీరంపై దద్దుర్లు వంటివి వస్తాయి. కొన్నిసార్లు శరీరం లోపలి ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఉంది. స్వల్ప జ్వరంతో పాటు తల, వెన్ను, గొంతు నొప్పులు వస్తాయి. వ్యాధి సోకిన వారిని ఒక గదిలేనే ఉంచాలి. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రందించాలి. ఈ వ్యాధి సోకిన వారికి వేరే ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాధి తీవ్రత పెరిగితే న్యూమోనియకు దారితీసే ప్రమాదముంది. మెదడుకు, ఊరిపితిత్తులకు ప్రమాదం వాటిల్లుతుంది.

కామెర్లు: మూత్రం పచ్చగా వస్తుంది. కళ్లు పచ్చబడతాయి. వ్యాధి కనిపించడానికి వారం రోజుల ముందే ఆకలి మందగిస్తుంది. జ్వరం, నోరు పచ్చబడి నాలుక కింద పచ్చదనం స్పష్టంగా కనిపిస్తుంది. కాలేయం పెరుగుతుంది. కుడి వైపు కడుపు నొప్పి ఉంటుంది. ఈ వ్యాధి పట్ల అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఈ వ్యాధి సోకిన సమయంలో కాచి వడగట్టిన నీటిని మాత్రమే తీసుకుంటూ డాక్టర్ సలహాలు పాటించాలి.

పాటించాల్సిన జాగ్రత్తలు..

వడదెబ్బ తగిలిన తర్వాత మళ్లీ ఎండలోకి వెళ్లకూడదు. విశ్రాంతి తీసుకోవాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీరాన్ని ఐస్ లేదా నీటితో తుడవాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు క్యాప్‍ పెట్టుకోవాలి లేదా గొడుగు వాడాలి. రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగుతూ సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. నూనె పదార్థాల వాడకం తగ్గించాలి. వేసవిలో శీతల పానీయాలు అంత మంచివి కాదు. వాటికి బదులు కొబ్బరి బోండాం, బార్లీ, మజ్జిగ లాంటి పదర్థాలు తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభాలు వుండవు. వడదెబ్బ వల్ల కళ్లు పొడిబారే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా సన్‌గ్లాసెస్ పెట్టుకోవాలి. చర్మం, వెంట్రుకలు కూడా పొడిబారిపోయే ప్రమాదం వుంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా నీళ్ల బాటిల్ లేదా ఓఆర్ఎస్ వెంట తీసుకెళ్లండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరగకూడదు.

ఈ చిట్కాలు పాటిస్తే.. వడదెబ్బ నుంచి సురక్షితం:

  • ఈ వేసవిలో కీరదోస కాయను విరివిగా వాడుకోవాలి. దీనివల్ల శరీరానికి నీటితోపాటు పోషకాలు కూడా అందుతాయి. ఈ కాలంలో ఎక్కువగా మజ్జిగ తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మలబద్దక సమస్య కూడా తగ్గుతుంది.
  • శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కొబ్బరినీళ్లు తీసుకుంటూ వుండాలి. తరచుగా సగ్గు బియ్యం జావను కూడా తీసుకుంటూ వుండాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఉల్లిపాయను మెత్తగా నూరి శరీరానికి రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అర స్పూన్ పొడిని ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగితే శరీరానికి బోలెడంత ఎనర్జీ వస్తుంది.
  • ఈ కాలంలో సలాడ్స్, తాజా కాయగూరలు, ప్రూట్ జ్యూస్‌లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వేడి వేడి ఆహార పదార్థాలను తీసుకంటూ వుండాలి. కారం పొడులు, నూనె, మసాలా దట్టించిన పదార్థాలు, మాంసాహారం తినకూడదు. రోడ్డు పక్కన దొరికే చిరుతిళ్లు తినడం తగ్గించాలి. నిల్వ చేసిన ఆహార పదార్థాలు కూడా తినకపోతే మంచిది. నిల్వ ఉన్న ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా, శిలీంద్రాలు ఉండే అవకాశాలు ఎక్కువ. అవి శరీరానికి చేటు చేస్తాయి.ఇలాంటి కొన్ని చట్కాలు పాటిస్తూ వడదెబ్బ నుండి మనల్ని మనం కాపాడుకుందాం.
Show Full Article
Print Article
Next Story
More Stories