Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి బాకీలు వసూలవుతాయి

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి బాకీలు వసూలవుతాయి
x

రాశి  ఫలాలు 

Highlights

Daily Horoscope: ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు.

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| ఆదివారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.51 | సూర్యాస్తమయం సా.6.11| తిథి అమావాస్య పూర్తి| తదుపరి పాడ్యమి |నక్షత్రం ఉత్తరాభాద్ర ప.గం.10.38 వరకు| తదుపరి రేవతి |రాహుకాలం : సా. 4.30 నుంచి 6.00 వరకు| యమగండం 12.00 నుంచి 1.30 వరకు| వర్జ్యం రా.9.28 నుంచి 11.22 వరకు| దుర్ముహూర్తం సా.04.33 నుంచి 5.21 వరకు| అమృతఘడియలు -| కరణం చతుష్పాత్ సా.05.50| యోగం ఐంద్రం ప.1.38 గం.ల వరకు|

మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. ఉద్యోగయోగం. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం

వృషభం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. రాజకీయవేత్తలకు చికాకులు.

మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కళాకారులకు కొంత గందరగోళం.

కర్కాటకం :శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.

సింహం: కుటుంబంలో శుభకార్యాలు.ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు.వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.

కన్య :కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. పనుల్లో అవరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ప్రయాణాలు వాయిదా. కళాకారులకు ఒత్తిడులు

తుల: వ్యయప్రయాసలు. దుబారా ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. బంధువర్గంతో విభేదాలు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు.

వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం : కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. రాజకీయవేత్తల యత్నాలు సఫలం.

ధనుస్సు : ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు కొంత నిరాశ.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆలయ దర్శనాలు. విద్యార్థులకు కొత్త ఆశలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఎంతగా కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు ఒత్తిడులు. కళాకారులు, పారిశ్రామికవేత్తల యత్నాలు ముందుకు సాగవు.

మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కళాకారులకు నూతనోత్సాహం.

Show Full Article
Print Article
Next Story
More Stories