Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు.

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 13th July
x

Daily Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: ఈ రోజు ఏఏ రాశులవారికి ఏ విధంగా వుందంటే

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగళవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబ ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం వల్ల మానసిక ఉద్రిక్తత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే అవకాశం కనిపిస్తోంది.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వయం ఉపాధి వారు పురోగతి సాధిస్తారు. కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారస్తులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. స్నేహితులు అపార్థం చేసుకునే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం సూచనలు కనిపిస్తున్నాయి.

కర్కాటకరాశి: ఈరాశి వారికి ఈ రోజు చిన్న వ్యాపారులకు అన్నివిధాలా బాగుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ దక్కే అవకాశాలు ఉంటాయి. లేదా ఇంక్రిమెంట్ కు అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం బాగుంది.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారులు ఆర్థికంగా లాభపడతారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అప్పులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూలమైన రోజు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. అనారోగ్య సూచలనలు ఉన్నాయి జాగ్రత్త.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఎటు చూసినా శుభమే గోచరిస్తోంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది.

తులరాశి: ఈరాశి వారికి ఈరోజు వ్యాపారులు శ్రమపడాల్సి ఉంటుంది. దగ్గరి బంధువులకు మాట సహాయం చేస్తారు. ఉద్యోగంలో మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అన్ని విధాలా అనుకూలమైన సమయం ఈ రోజు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, ఖర్చులు పెరుగుతా యి. తల పెట్టిన పనులు పూర్తవుతాయి. ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్య సూచలను కనిపిస్తున్నాయి జాగ్రత్త.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు వ్యాపారులు సునాయాసంగా ఆదాయం పెంచుకుంటారు. ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. వ్యాపారులు సునాయాసంగా ఆదాయం పెంచుకుంటారు.

మకర రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారులు లాభాల బాటపడతారు. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి వ్యాపారులు, స్వయం ఉపాధివారు పురోగతి సాధిస్తారు. ఆదాయం పెంచుకునే మార్గం ఆలోచిస్తారు. కుమారుడికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ ఆరోగ్యంతో పాటు కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో కొంచెం రిస్క్ తీసుకుంటే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ తెలివితేటలతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం నిలకడగా వుంటుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories