Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 14th April
x

Todays Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| బుధవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషం: ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు.

వృషభం: ఉద్యోగానికి ఆఫర్‌ అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఎంతో శ్రమ మీద పనులు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి అన్నివిధాలా బాగుంది.

మిథునం: ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. కొంతవరకు శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఏమీ ఉండదు కానీ ఖర్చులు మాత్రం పెరుగుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు.

కర్కాటకం: ఉద్యోగంలో ప్రమోషన్‌ను ఆశించవచ్చు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. తలచిన పనులు నెరవేరుతాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

సింహం: తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం పరవాలేదు. కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది.

కన్య: ఆదాయం నిలకడగానే ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఇరుగు పొరుగుతో విందులో పాల్గొంటారు. వ్యాపారులకు, ఐ.టి నిపుణులకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. పెళ్లి సంబంధం కుదురుతుంది. కామర్స్ విద్యార్థులు పురోగతి సాధిస్తారు.

తులా: ఉద్యోగరీత్యా స్థాన చలనానికి అవకాశం ఉంది. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సిన వాళ్లు వాయిదా వేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. తగాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయపరంగా సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తారు.

మకరం: ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండవు కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల్లో చదువు పట్ల శ్రద్ధ కనిపిస్తుంది. సన్నిహితులు అపార్థాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

కుంభం: ఉద్యోగంలో మార్పు జరగవచ్చు. పెళ్లికి సంబంధించి శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ధనలాభ సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది.

మీనం: ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆదాయంలో మార్పేమీ ఉండదు. ఊహించని ఖర్చులు మీద పడతాయి. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories