Top
logo

Daily Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈరాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 18 08 2021
X

Representation Photo

Highlights

Daily Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈరాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి

ఈ రోజు రాశి ఫలాలు: శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; శ్రావణ మాసం; శుక్ల పక్షం ఏకాదశి: రా.12.13 తదుపరి ద్వాదశి మూల: రా.12.17 తదుపరి పూర్వాషాఢ వర్జ్యం: ఉ.9.19 నుంచి 10.49 వరకు తిరిగి రా.10.47 నుంచి 12.17 వరకు అమృత ఘడియలు: సా.6.18 నుంచి 7.47 వరకు దుర్ముహూర్తం: మ.11.38 నుంచి 12.28 వరకు రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు సూర్యోదయం: ఉ.5-46, సూర్యాస్తమయం: సా.6-21

మేష రాశి : వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులు ఎదురుకుంటారు. మీ మిత్రుడు మిమ్మల్ని పెద్దమొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు. మీరు వారికి సహాయము చేస్తే మీరు ఆర్ధికంగా కష్టాల్లో పడుతారు. వార్షిక జీతంలో పెరుగుదల, మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. విద్యార్థులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.

వృషభ రాశి: మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్త వహించండి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారస్తులకు కష్టాలు తప్పవు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉంటేనే మంచిది. విద్యార్ధులకు అవకశాలు దూరం అవుతాయి. ఉద్యోగులకు అధికారులతో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణంలో జాగ్రత్త వహించండి.

మిథున రాశి: మిమ్మల్ని ఇష్టపడి, మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. సమాజంలో పైచాయలు పెరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధికంగా వృద్ధి చెందుతారు. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. మీరు మీజీవితభాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.

కర్కాటక రాశి: ఈ రాశిలో వివాహము అయిన వారు వారి యొక్క అత్తామావయ్యలనుండి ఆర్ధిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఈరోజు విద్యార్థులకు అనుకూలమైన రోజు. వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మీరు మంచి పేరు సంపాదిస్తారు.

సింహ రాశి: బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగలవారికి దూరంగా ఉండండి. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి. ట్రావెల్ మరియు విద్య పథకాలు మీ తెలివిని పెంచుతాయి. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్పవచ్చు.

కన్యా రాశి: మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉండేలాగ చేస్తుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. ఈ రోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతారు. ఈ రాశికి చెందినవారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోర్కెలు తీర్చుకోడానికి, పుస్తకపఠనం, మీకు ఇష్టమైనపాటలు వినడానికి ఈసమయాన్ని వాడుకుంటారు.

తులా రాశి: సమయము యొక్క ప్రాముఖ్యతను అర్ధంచేసుకోండి. ఇతరులను అర్ధం చేసుకోవాలనుకోవటం అనవసరం. క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించ డానికి మంచిరోజు. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. అవును. ఆ అదృష్టవంతులు మీరే. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం కాస్త అందరాగోలంగా ఉండే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: కుటుంబసభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును. మీరు కుటుంబ సభ్యులకు ఆర్ధిక విషయాల్లో దాపరికం లేకుండా ఉండాలి అని చెప్పండి. గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది, వీలుకల్పిస్తుంది. మీరు ఈరోజు అధికమొత్తంలో స్నేహితులతో పార్టీలకొరకు ఖర్చుచేస్తారు.అయినప్పటికీ మీకు ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదు. గ్రహచలనం రీత్యా, మీకు సంతోషాన్ని కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి.

ధనస్సు రాశి : ఈరోజుకోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకొండి. సాయంత్రం, మీరున్నచోటికి అనుకోని అతిథులు క్రమ్మెస్తారు. వేరేవారి జోక్యం వలన, మీ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడండి. సమయాన్ని సదివినియోగం చేసుకోవటంతోపాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడము అవసరము.ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ ,దానిని అమలుపరచటంలో విఫలము చెందుతారు.

మకర రాశి: అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీ హాస్యచతురత, మీకు గల ప్రత్యేక భూషణం, దానిని, మీ అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు మీమనస్సుకు బాగా దగ్గరైనవారికి గొడవలు జరిగే అవకాశము ఉన్నది,దీనివలన మీరు న్యాయస్థానం మెట్లు ఎక్కవలసి ఉంటుంది. దీనివలన మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీరు మీపనులను పూర్తిచేయని కారణముగా ఆఫీసులో మీఉన్నతాధికారుల ఆగ్రహానికి గురిఅవుతారు. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటి వాటిని మర్చిపోండి.

కుంభ రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్ధులకు కొత్త అవకాశాలు. ఈరోజు మీరు పూర్తి హుషారుగా, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తిచేసేస్తారు. ఎవరైనా ఇతరుల దగ్గరనుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటు వంటి పరిస్థితులు వచ్చిన తిరిగి చెల్లించవలసి ఉంటుంది. మీ సరదా మనస్త్వత్వం మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు.

మీనా రాశి: ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి ఊరట పొందబోతున్నారు. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటి నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. ఈరోజు ఆఫీస్ లో మీదే రాజ్యం. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ కంటే పెద్దవారిని అలుసుగా తీసుకోకండి. ఖాళీసమయములో మీకు నచ్చినట్టుగా ఉంటారు. మహిళలకు శుభవార్తలు. కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 18 08 2021
Next Story