Top
logo

Daily Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆర్ధికంగా అనుకూలమైన రోజు

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 20 08 2021
X

Representation Photo

Highlights

ఈ రోజు రాశి ఫలాలు: శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; శ్రావణ మాసం; శుక్ల పక్షం త్రయోదశి: రా. 8.10 ...

ఈ రోజు రాశి ఫలాలు: శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; శ్రావణ మాసం; శుక్ల పక్షం త్రయోదశి: రా. 8.10 తదుపరి చతుర్దశి ఉత్తరాషాఢ: రా. 9.48 తదుపరి శ్రవణం వర్జ్యం: ఉ. 6.33 నుంచి 8.05 వరకు తిరిగి రా. 1.40 నుంచి 3.13 వరకు అమృత ఘడియలు: మ. 3.42 నుంచి 5.13 వరకు దుర్ముహూర్తం: ఉ. 8.17 నుంచి 9.07 వరకు తిరిగి మ.12.28 నుంచి 1.18 వరకు రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు సూర్యోదయం: ఉ.5-47, సూర్యాస్తమయం: సా.6-20

శ్రీవరలక్ష్మీ వ్రతం

మేష రాశి : మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఈరోజు మీరు, పూర్తి హుషారుగా శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తిచేసేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్ధులకు కొత్త అవకాశాలు. వేరేవారి జోక్యం వలన, మీ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడండి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది.

వృషభ రాశి: ప్రతి ఒక్కరు చెప్పినది వినండి, అది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చును. ఈరోజుకోసం బ్రతకడం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చెయ్యడం, అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకొండి. మీరు మీపనులను పూర్తిచేయని కారణముగా ఆఫీసులో మీఉన్నతాధికారుల ఆగ్రహానికి గురిఅవుతారు. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటి వాటిని మర్చిపోండి. కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు.

మిథున రాశి: ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు పెట్టుబడి పెట్టడం మానాలి. ఇంటిలో సమస్య కూడుకుంటోంది, కనుక ఏం మాట్లాడుతున్నారో, జాగ్రత్త వహించండీ. ఈ రోజు హాజరయే సామాజిక కార్యక్రమాల్లో మీరు హైలైట్ గా ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచి ఉంచండి. ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. మీరు ఈరోజు అధికమొత్తంలో స్నేహితులతో పార్టీలకొరకు ఖర్చుచేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదు.

కర్కాటక రాశి: ఎవరైతే ధనాన్ని జూదంలోనూ, బెట్టింగ్లోను పెడతారోవారు ఈరోజు నష్టపోకతప్పదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. మీకు మీరే అనవసరమైన, మానసిక ఆందోళన కల్పించుకుంటారు. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. ఈరోజు మీరు హాజరుకాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు ఖాళీ సమయంలో, పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు.

సింహ రాశి: ఈరోజు మీరు, అందరి దృష్టి పడేలాగ ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా మద్యపానానికి దూరంగా ఉండండి. మీ ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరినీ రిలాక్స్ అయే లాగ ఆహ్లాదం పొందేలాగ చేస్తుంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది. మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయములో పూర్తిచేయండి.

కన్యా రాశి: మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకొండి. వారినికూడా విలువగలవారిగా భావించనివ్వండి. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. పెద్దవారు, తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి, కూడగట్టాల్సిన అవసరం ఉన్నది.

తులా రాశి: మీ వృత్తి కార్యక్రమాలు పనులు సజావుగా చేయడానికి ఎంతో చురుకుగా ఉండాలి. ఆరోగ్య సంబంధ సమస్యలు ఇబ్బందిని కలిగించవచ్చును. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము చూపించడం వలన మీరు ఆర్ధికంగా నష్టపోతారు. తన జీవితం కంటె మిమ్మల్నే ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీకొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్నికేటాయిస్తారు మరియు మీరు కొత్త అభిరుచులను అలవాటు చేసుకుంటారు.

వృశ్చిక రాశి: ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇది మీకు ఆర్ధికలాభాన్ని చేకూరుస్తుంది. ఈరోజు చేసిన పెట్టుబడులు మంచి లాభాలను తెస్తుంది. గత వెంచర్లనుండి వచ్చిన విజయం, మీకు మీపట్ల నమ్మకాన్ని పెంతుంది. ఈ రోజు మీరు సామాజిక పనులపై దృష్టి పెడతారు మిమ్మల్ని సమస్యలతో కలిసిన వారిపట్ల ఉదారత మరియు సహాయం చేస్తారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణ ప్రణాళిక కొంతకాలంలో విజయవంతం కాగలదు.

ధనస్సు రాశి : ఆర్థికపరంగా మీరు స్థిరంగా ఉంటారు. మీ హాస్యచతురత, మీకు గల ప్రత్యేక గుర్తింపు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన ధనలాభంలో ఊహించని ఫలితాలు సంభవిస్తాయి. వాయిదా పడ్డ ఇంటి పనులను పూర్తి చేస్తారు. మీకు నచ్చిన వ్యక్తులు మీ మాట వినకుండా వారికి తోచింది చేయడం వలన మిమ్మల్ని నిరాశకు గురి చేస్తారు. ఉమ్మడి వ్యాపారాలకు కొంత దూరంగా ఉండండి. భాగస్వాములు మిమ్మల్ని పావుగా వాడుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన భవిష్యత్తులో మీరు బాధపడాల్సి వస్తుంది.

మకర రాశి: వివాహబంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. మీ ప్రేమ మరింత ఆనందంగా ఉండాలనుకుంటే మూడో వ్య్తక్తి మాటలను అస్సలు నమ్మవద్దు. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటె ముందుండేలాగ చేయడానికి సహాయపడుతుంది.పని మధ్యలో విశ్రాంతి తీసుకోండి. పొదుపు, పెట్టుబడులపై ఇతరుల సలహాలు తీసుకొండి. మీవద్ద పనిచేసే వారు ఆశించినంతగా పని చేయకపోవడంతో మీరు నిరాశ చెందుతారు.

కుంభ రాశి: మీరు మీ జీవితభాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధికొరకు సమాలోచనలు చేస్తారు. మీ సంకల్ప బలంతో ఒక అయోమయ పరిస్థితిని కూడా దీటుగా ఎదుర్కోవడం వలన అది ప్రశంసలను పొందుతుంది. ఒక ఉద్వేగ భరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీరు స్థిరత్వాన్ని కొల్పొకూడదు. స్నేహితులతోను, క్రొత్తవారితోను ఒకేలాగ మెళకువగా ప్రవర్తించండి. మీకు బాగా దగ్గరైనవారు మిమ్ములను వారితో సమయము గడపమని కోరతారు కానీ సమయము చాలా విలువైనది కనుక మీరు వారి కోరికను తీర్చలేరు.

మీనా రాశి: పెద్దలను గౌరవించండి. ఆఫీసు మరియు ఇతర పనులకు వెళ్ళే వారు సమయాన్ని పాటించండి. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు సానుకూల దృక్పధంతో ఇంటి నుండి బయటకు వెళతారు. కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీ మనసు పాడవుతుంది. బంధువులను లేదా స్నేహితులను కలవడానికి వెళ్ళిన చిన్న ట్రిప్ మీకు చక్కని విశ్రాంతిని కలగచేస్తుంది. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి. మీకు గౌరవం ఇవ్వని వాళ్ళని లెక్కచేయకండి. మీకు ఈరోజు సహాయపడుతుంది. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Web TitleDaily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 20 08 2021
Next Story