Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈ రాశి వారికి అనుకోని ప్రయాణాలు!!

Today Horoscope
x

రాశిఫలాలు 

Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 20 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయనం | పుష్య మాసం | శుక్లపక్షం | సప్తమి - 13:16:36 వరకు తదుపరి అష్టమి | రేవతి నక్షత్రం - 12:36:33 వరకు తదుపరి అశ్వని | వర్జ్యం 12:04:39 నుండి 12:49:39 వరకు | అమృత ఘడియలు లేవు వరకు | దుర్ముహూర్తం 12:04:39 నుండి 12:49:39 వరకు | రాహుకాలం 12:27:09 నుండి 13:51:30 వరకు | సూర్యోదయం: ఉ.06-49 | సూర్యాస్తమయం: సా.05-59

ఈరోజు రాశిఫలాలు

మేషం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం: ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి.

మిథునం: సన్నిహితులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి.

సింహం: పనులు మధ్యలో విరమిస్తారు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒత్తిళ్లు.

కన్య: ఇంటర్వ్యూలు అందుతాయి. నూతన ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.

తుల: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులు చేపడతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి స్నేహితుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం: కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. ఒప్పందాలు వాయిదా. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో అనుకూలత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది.

కుంభం: సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలత. కొత్త వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మీనం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాల ప్రస్తావన. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories