Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈరాశి వారికి ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి!!

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈరాశి వారికి ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి!!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 23 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయనం | పుష్య మాసం | శుక్లపక్షం | దశమి - 20:57:50 వరకు తదుపరి ఏకాదశి | కృతిక నక్షత్రం - 21:32:48 వరకు తదుపరి రోహిణి | వర్జ్యం 07:34:46 నుండి 08:19:53 వరకు | అమృత ఘడియలు 12:05:26 నుండి 12:50:33 వరకు | దుర్ముహూర్తం 06:49:39 నుండి 07:34:46, 07:34:46 నుండి 08:19:53 వరకు | రాహుకాలం 09:38:49 నుండి 11:03:24 వరకు | సూర్యోదయం: ఉ.06-49 | సూర్యాస్తమయం: సా.05-59

ఈరోజు రాశిఫలాలు

మేషం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వస్తులాభాలు.

వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. నిర్ణయాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కర్కాటకం: నూతన ఉద్యోగలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కన్య: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ధనవ్యయం. బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పోత్సాహం.

ధనుస్సు: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం: దూరపు బంధువులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కుంభం: ఇంటర్వ్యూలు రాగలవు. కార్యజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

మీనం: కుటుంబంలో చికాకులు. బంధువులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories