Ugadi day 2024: ఉగాది రోజున ఇలా చేయండి.. శుభాలను పొందండి..!

Do this on Ugadi day get Good Luck
x

Ugadi day 2024: ఉగాది రోజున ఇలా చేయండి.. శుభాలను పొందండి..!

Highlights

Ugadi day 2024: ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ వస్తోంది. ఉగాది తెలుగువారి మొదటి పండుగ అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు.

Ugadi day 2024: ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ వస్తోంది. ఉగాది తెలుగువారి మొదటి పండుగ అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం వచ్చింది. అంటే క్రోధమును కలిగించేదని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో ప్రజలు కోపం, ఆవేశంతో వ్యవహరిస్తారని అంటున్నారు.ఈ రోజున అందరూ ఉగాది పచ్చడి తాగి రోజువారీ పనులు మొదలుపెడుతారు. ఈ రోజున ఎలా గడిపితే శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, విష్ణుమూర్తి, ల‌క్ష్మీదేవిని పూజించాలి. శివుడికి రుద్రాభిషేకం చేయాలి. విష్ణుమూర్తి అష్టోత్తరం, ల‌క్ష్మీదేవి అష్టోత్తరం, లేదా విష్ణుమూర్తి స‌హ‌స్రనామం, ల‌క్ష్మీదేవి స‌హ‌స్రనామాన్ని ప‌ఠించాలి. భ‌క్తితో, విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి, ల‌క్ష్మీదేవిల‌ను. పార్వతి పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫ‌లితాన్ని పొందుతారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. దగ్గరిలోని దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి.

ఈ రోజున ఉగాది ప‌చ్చడితోపాటు పాల‌తో చేసిన పదార్థాలను స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టాలి. ప‌చ్చడిని ప్రసాదంగా స్వీక‌రించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. సాధారణంగా ఈ సంవ‌త్సరం ఎలా ఉండ‌బోతుంది అని తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరు పంచాంగ శ్రవ‌ణం చేయాలి. ఈ సంవ‌త్సరం జాత‌కంలో ఏఏ దోషాలు ఉన్నాయి, రాశులు ఎలా ఉన్నాయి, తిధి, యోగము, క‌ర్నము, వారం ఇలా అన్ని విష‌యాల‌ను తెలుసుకొని ప‌ద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories