Ind VS Eng Test match: టీమిండియాకు సవాల్‌గా మారిన మూడో టెస్టు

X
ఇండియా vs ఇంగ్లాండ్ లోగో (ఫైల్ ఇమేజ్)
Highlights
Ind VS Eng Test Match: రేపు మొతేరాలో పింక్ బాల్ టెస్టు
Sandeep Eggoju23 Feb 2021 1:01 AM GMT
Inda VS Eng: రేపు జరగబోయే పింక్ బాల్ టెస్టుకు ఇండియా, ఇంగ్లండ్ సిద్ధమవుతున్నాయి. రెండో టెస్టులో గెలుపుతో జోరుమీదున్న టీమిండియా మూడో టెస్టులోనూ విజయం సాధించాలని చూస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని భావిస్తోంది. ఇక టీమిండియాకు ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో నిలవాలంటే మరో గెలుపు తప్పనిసరి కావడంతో అహ్మదాబాద్ టెస్ట్ కీలకంగా మారనుంది.
మరోవైపు పింక్ బాల్ టెస్ట్‌మ్యాచ్ విరాట్కోహ్లీకి సవాల్‌గా మారింది. రెండు మ్యాచుల్లో స్పిన్నర్లు రాణించినా మొతేరా పేస్‌కు అనుకూలించే పిచ్ కావడంతో మరో పేసర్‌ను బరిలోకి దించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఎవరిని టీమ్‌లోకి తీసుకోవాలి..? ఎవరిని తప్పించాలనే ఆలోచనలో పడింది టీమిండియా. అయితే కుల్దీప్ను పక్కనబెట్టి మరో పేసర్‌కు చోటు కల్పిస్తారని తెలుస్తోంది.
Web TitleInd VS Eng Test Match: 3rd test match is a challenge to Team India
Next Story