Australia vs India: బిహారి కాదు విహారి ..బీజేపీ ఎంపీకి అదిరిపోయే పంచ్


బీజేపీ ఎంపీ , విహారి
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫిలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మూడో టెస్టులో భారత్ డ్రాతో ముగించింది. అయితే ఈ మ్యాచ్ క్లిష్ట సమయంలో డ్రాతో...
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫిలో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మూడో టెస్టులో భారత్ డ్రాతో ముగించింది. అయితే ఈ మ్యాచ్ క్లిష్ట సమయంలో డ్రాతో గట్టెక్కిందంటే దానికి కారణం తెలుగు ఆటగాడు విహారినే. టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం క్రికెట్ అభిమానలు అందరూ విహారిని ప్రశంసిస్తున్నారు. దీనికి భిన్నంగా హనుమ విహారిపై బీజేపీ ఎంపీ విమర్శిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో చేసిన ట్వీట్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు విహారి.
ఇంతకి ఆ ఎంపీ ఎం అన్నారంటే.. బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో.. విహారి ఇన్నింగ్స్‌ను విమర్శించారు. 109 బంతుల్లో కేవలం 7 పరుగులు చేస్తాడా.. అతని వల్లే టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించలేకపోయింది. విజయం కోసం ప్రయత్నించకపోవడం నేరమే అవుతుందంటూ బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ లో హనుమ విహారి పేరును .. హనుమ బిహారి అని రాశారు. దీనికి విహారి ఇచ్చిన రిప్లై నెటిజన్లను ఆకర్షిస్తోంది.
విహారి ఎంపీ చేసిన విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా సింపుల్‌గా.. హనుమ విహారి అని రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లైకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. నెటిజన్లు విహారిని ట్వీట్ ను ట్వీట్ ఆఫ్ ద డెకేడ్ అని ఒకరు.. ఎపిక్ అని మరొకరు.. మంచి ఆన్సర్ ఇచ్చావని ఇంకొకరు విహారిపై ప్రశంసలు కురిపించారు. అశ్విన్ విహారి ట్వీట్ ను షేర్ చేశారు.
ఎంపీ బాబుల్ సుప్రియో ప్లే బ్యాక్ సింగర్‌గా గుర్తింపు సంపాదించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. బ్రిస్బేన్ వేదికగా ఈ నెల 15 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టుకి తొడ కండరాల గాయంతో
విహారి దూరమయ్యాడు.
Playing 109 balls to score 7 !That is atrocious to say the least•Hanuma Bihari has not only killed any Chance for India to achieve a historic win but has also murdered Cricket.. not keeping win an option, even if remotely, is criminal.
— Babul Supriyo (@SuPriyoBabul) January 11, 2021
PS: I know that I know nothing abt cricket
*Hanuma Vihari
— Hanuma vihari (@Hanumavihari) January 13, 2021

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire