Azharuddin: హెచ్ సీఏ నుంచి అజారుద్దీన్ ను తప్పించిన అపెక్స్ కౌన్సిల్

HCA Apex Council Issues Notices Azharuddin
x

Mohammad Azharuddin:(File Image)

Highlights

Azharuddin: హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజహరుద్దీన్‌పై తాజాగా వేటు పడింది.

Azharuddin: హెచ్ సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ పైనే వేటు పడింది. టీమిండియా మాజీ కెప్టెన్ అజార్ పై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయన్న కారణంతో అపెక్స్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏలో అజర్ సభ్యత్వాన్ని కూడా కౌన్సిల్ రద్దు చేసింది. అజ్జూ భాయ్ హెచ్ సీఏ అధ్యక్ష పదవిలోకి వచ్చినప్పటి నుంచే విభేదాలు భగ్గుమన్నాయి.

ఏప్రిల్ 11న హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో అజహరుద్దీన్, విజయానంద్ వాగ్వాదానికి దిగారు. సర్వసభ్య సమావేశంలో 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబుడ్స్‌ మన్‌గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం విషయంలో అజారుద్దీన్, విజయానంద్ మధ్య స్టేజీపైనే ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే వేటు పడినట్టు అర్థమవుతోంది.

హెచ్‌సీఏలో అజారుద్దీన్ నాయకత్వంపై గతంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను అజహరుద్దీన్ ప్రోత్సహించడంలేదని విమర్శలు చేశారు. అజార్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విషయంపై కేంద్రహోంమంత్రికి ఫిర్యాదు చేసి, ఆ కేసును సీబీఐతో పునర్విచారణ జరిపించాలని కోరతామని యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత కూడా హెచ్‌సీఏలో ‌జరుగుతున్న అవకతవకలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా అజర్ కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు పంపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నందుకే వేటు వేసినట్టు స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories