Australia Vs New Zealand T20 Series - తొలి T20లో ఆసీస్ చిత్తు

ఇమేజ్ సోర్స్: Devon Conway (ఫోటో cricket.com.au ట్విట్టర్)
T20 Series: ఐదు T20ల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిని తొలి టీ20లో ఆస్ర్టేలియా పరాజయం పాలైంది.
T20 Series: ఐదు T20ల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిని తొలి టీ20లో ఆస్ర్టేలియా పరాజయం పాలైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విశేషంగా రాణించిన కివీస్.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కివీస్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కీవీస్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ జట్టు 17.3 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. ఆసీస్ జట్టు అన్ని రంగాల్లో విఫమలై పరాజయాన్ని మూటగట్టుకుంది.
కంగారు టీంలో మిచెల్ మార్ష్(45; 33 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్స్‌లు)మాత్రమే రాణించాడు. మాథ్యూ వేడ్ (12), మార్కస్ స్టోయినిస్(8), జోష్ ఫిలిప్పి(2), అరోన్ ఫించ్(1), మ్యాక్స్‌వెల్(1) లు తీవ్రంగా నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో ఇష్ సోథీ 4 వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీయగా, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్‌లు చేరో 2 వికెట్లు సాధించారు.
కాగా, మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ క్రికెట్ టీంకు కూడా శుభారంభం లభించలేదు. ఓపెనర్లు గప్టిల్(0), సీఫెర్ట్(1)లు ఇద్దరూ నిరాశపరిచారు. అనంతరం కెప్టెన్ విలియమ్సన్(12) కూడా విఫలమయ్యాడు. కానీ, తన కెరీర్లో ఏడో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న కాన్వే ఆసీస్ బౌలర్లపై ప్రతాపం చూపాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 99 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. చివరి బంతికి సింగిల్ మాత్రమే తీయడంతో సెంచరీకి ఒక పరుగు దూరంలో ఆగిపోయాడు. ఇక గ్లెన్ ఫిలిప్స్(30), నీషమ్(26)లు చివర్లో బ్యాట్ ఝుళిపించడంతో కివీస్ 184 స్కోరు చేసింది.
Handshakes at Hagley! A 53 run win to start the KFC T20 Series against Australia. Mitchell Santner with the final wicket. Dunedin is next for Game 2 on Thursday! #NZvAUS pic.twitter.com/sEzrNs8Z4u
— BLACKCAPS (@BLACKCAPS) February 22, 2021