Top
logo

Ravichandran Ashwin: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్న అశ్విన్..

Ravichandran Ashwin: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్న అశ్విన్..
X

Ravichandran Ashwin: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్న అశ్విన్.. 

Highlights

Ravichandran Ashwin: ఇంగ్లాండ్‌తో భారత్ ఆడుతోన్న నాలుగు టెస్టుల మ్యాచ్‌లో భాగంగా ఇండియన్ ఆఫ్ స్పిన్నర్...

Ravichandran Ashwin: ఇంగ్లాండ్‌తో భారత్ ఆడుతోన్న నాలుగు టెస్టుల మ్యాచ్‌లో భాగంగా ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంచి ప్రతిభను కనబరుస్తున్నాడు. ఓ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో కలిపి అశ్విన్ 17.82 సగటుతో 17 వికెట్లు పడగొట్టి రెండో టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో అశ్విన్ ఏకంగా రెండుసార్లు 5 వెకెట్లు తీసుకొని రికార్డు సృష్టించాడు. 2011లో టెస్టు మ్యాచ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్‌ ఇప్పటివరకు 76 టెస్టు మ్యాచుల్లో 394 వికెట్లు తీసుకున్నాడు. 400 వికెట్లు పడగొట్టిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కేందుకు అశ్విన్‌ మరో 6 వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. దీంతో భారత్‌-ఇంగ్లాండ్‌ల మధ్య అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో రేపటి నుంచి ప్రారంభంకానున్న మూడో మ్యాచ్‌లో అశ్విన్‌ ఆ రికార్డును తిరగరాస్తాడా లేదా వేచి చూడాలి.

Web TitleRavichandran Ashwin Required 6 wickets to Reach 400 Test wickets
Next Story