TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 4,693 కేసులు, 33 మంది మృతి

4693 New Coronavirus Cases Reported in Tealngana on 13 MAY 2021
x

తెలంగాణలో కొత్తగా 4,693 కేసులు (ఫొటో ట్విట్టర్)

Highlights

TS Corona Cases: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

TS Corona Cases: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 4వేల693 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,16,404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 33 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 2,863కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 56,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ రోజు 6వేల876 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 734 కేసులు నమోదయ్యాయని పేర్కొంది.




Show Full Article
Print Article
Next Story
More Stories