Telangana: అప్ప‌టి వరకు రెండో డోసు వారికి కరోనా టీకా!

Corona Vaccine Telangana
x

కరోనా వ్యాక్సిన్ ఫైల్ ఫోటో 

Highlights

Telangana: తెలంగాణ‌లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

Telangana: తెలంగాణ‌లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. తొలుత 18 నుంచి 45 ఏళ్ల వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ ఇవ్వాల‌ని భావించిన‌ప్ప‌టికీ.. టీకాల‌ కార‌ణంగా రెండో డోసు వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రెండో డోసు వారికి 31 వరకు కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 15 లక్షల మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. వీరంతా పూర్తయిన తర్వాత మిగతా వారికి విడతల వారీగా టీకాలు అందజేస్తామని స్పష్టం చేశారు.

ఇక రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ప‌డ‌క‌ల‌ కొరత లేదని శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,738 ఆక్సిజన్‌ బెడ్లు, 17,267 ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అనుమతించినట్లుగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు. అయితే, ఆ సమయంలోనూ కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు.అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు. మరో ప్రత్యామ్నాయం లేకే రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిందని పేర్కొన్నారు.

మ‌రోవైపు తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. తాజాగా గత‌ 24 గంటల్లో 4వేల693 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,16,404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్రంలో 33 మంది కరోనాతో మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories