ఓ మనిషి ప్రాణం తీసిన కోడిపుంజు

Arun Chilukuri
Updated on: 26 Feb 2021 8:20 PM IST
ఓ మనిషి ప్రాణం తీసిన కోడిపుంజు
X

ఓ మనిషి ప్రాణం తీసిన కోడిపుంజు

ఓ కోడిపుంజు మనిషి ప్రాణాన్ని తీసింది. కోడిపుంజు ఏంటి..? అది మనిషిని చంపడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవునండి బాబు.. మనిషి ప్రాణం తీసినందుకే ఆకోడి పుంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు పీఎస్‌లో దాన్ని బంధీని చేశారు. స్టేషన్‌లోనే దానికి దాన వేస్తూ.. తప్పక, విధి లేక ఆకోడికి భద్రత కూడా ఏర్పాటు చేశారు.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్‌ గ్రామంలో కోడి పందాలకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు తరలివచ్చారు. అయితే ఈ కనిపిస్తున్న కోడిపుంజును కూడ పందాల కోసం సిద్ధం చేశారు. ఇక పందాలలో భాగంగా కోడికి అమర్చిన కత్తి కొండాపూర్‌ గ్రామానికి చెందిన సత్తయ్యకు తగలకూడని చోట గుచ్చుకుంది. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా సత్తయ్య మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పందాలరాయుళ్లనే కాక కోడిపుంజును కూడా అదుపులోకి తీసుకున్నారు.

మొత్తానికి సరదా కోసం ఆడే కోడి పందెం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఊహించని విధంగా జరిగిన ఘటనతో ఓ నిండు ప్రాణం బలైంది. మసాలా వేసి మంచినాటు కోడిపుంజు మాంసం తిందామనుకునే వారికి షాక్‌ తగిలించింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.