Hyderabad: వన్ డ్రైవ్ రెస్టారెంట్ ఘటనలో నిందితుడు మైనర్ బాలుడు

* ఆరునెలల క్రితమే హోటల్ లో చేరినట్లు గుర్తింపు * వారం క్రితమే స్మార్ట్ ఫోన్ కొనుగోలు

Sandeep Reddy
Updated on: 23 Sept 2021 4:00 PM IST
Minor Boy Accused of Video Recording in Ladies Wash Room in Jubliee Hills One Drive Restaurant Hyderabad
X

వన్ డ్రైవ్ రెస్టారెంట్ 

Hyderabad: వన్ డ్రైవ్ రెస్టారెంట్ ఘటనలో నిందితుడు మైనర్ బాలుడని ఆరునెలలుగా హోటల్ లో పనిచేస్తున్నాడని హోటల్ యాజమాన్యం చెబుతోంది. పర్సనల్ పనికోసం యువతి వాష్ రూమ్ కి వెళ్లినప్పుడు సీక్రెట్ ప్లేస్ లో మొబైల్ ఫోన్ గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారం క్రితమే బాలుడు ఆ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినట్లు యాజమాన్యం చెబుతోంది. హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ , హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు హోటల్ యజమాని చైతన్యను పీఎస్ కు పిలిచి విచారిస్తున్నారు. కేసులో ప్రమేయం ఉన్నఅందరినీ విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story