Top
logo

KCR News Today: ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

Telangana CM KCR Going to Delhi Today 24 9 2021 Evening | Telugu Online News
X

ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

Highlights

KCR News Today: *మూడు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్న సీఎం *కేంద్ర మంత్రులను కలువనున్న సీఎం కేసీఆర్

KCR News Today: తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ భాట పట్టనున్నారు. ఈ నెల ఒకటో తేదీన హస్తిన వెళ్లిన కేసీఆర్ తొమ్మిది రోజుల పాటు బిజీబిజీగా గడిపి వచ్చారు. ఇవాళ సాయంత్రం మళ్లీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నారు వివిధ రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పై హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులను కలవనున్నారు సీఎం కేసీఆర్.

ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న శాసనసభా సమావేశాల్లో పాల్గొని, ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశం తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేఖావత్ తో భేటి కానున్నారు. జలవివాదాల అంశంపై ఏపీ ప్రభుత్వం తీరును మరోసారి ఫిర్యాదు చేయనున్నారు. ఎల్లుండి విజ్జానభవన్ లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రులను కలిసి తిరిగి 26వ తేదీ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. ధాన్యం కొనుగోలు అంశం పై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో భేటి కానున్నారు సీఎం కేసీఆర్.

Web TitleTelangana CM KCR Going to Delhi Today 24 9 2021 Evening | Telugu Online News
Next Story