హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది

Andhra Pradesh government petition in supreme court
x

ప్రతీకాత్మక చిత్రం 

Highlights

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పంచాయతీ ఎన్నికల పిటిషన్‌ను త్వరగా విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం...

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పంచాయతీ ఎన్నికల పిటిషన్‌ను త్వరగా విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును నిలుపుదల చేయాలని పిటిషన్‌ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపింది. హైకోర్టు తీర్పు అమలును నిలిపివేయాలని.. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో పేర్కొంది. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలంటే ప్రజల ప్రాణాలు పణంగా పెట్టడమేనని.. ఫిబ్రవరిలో పోలీసులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉండనుందని.. ఈ నేపథ్యంలో వారు ఎన్నికల విధుల్లో పాల్గొనలేరని తెలిపింది. ఎన్నికల కమిషనర్‌ దురుద్దేశంతోనే.. షెడ్యూల్‌ విడుదల చేసిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories