Job Calendar: ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

AP CM Jagan to Release Job Calendar Today
x

జగన్(ఫైల్ ఇమేజ్ )

Highlights

Job Calendar: ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది.

Job Calendar: ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా టైంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఆయా శాఖల వారిగా ఉన్న ఖాళీల నివేదికను జగన్ ప్రభుత్వం రెడీ చేసింది. విద్య, వైద్యం, పోలీస్‌ శాఖల్లో భర్తీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 10వేల 143 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నెలలో ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్‌లాగ్‌ కింద 1వెయ్యి 2వందల 38 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 కింద మరో 36 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అలాగే సెప్టెంబరులో పోలీస్‌ శాఖలో 450 మంది కొత్త ఉద్యోగులను తీసుకోనున్నారు. ఇలా ఏఏ నెలలో ఏయే శాఖలో ఎన్నెన్ని నియామకాలు చేపట్టనున్నారో ఏపీ ప్రభుత్వం ముందే జాబ్‌ క్యాలెండర్‌ను రిలీజ్ చేయనుంది. సీఎం జగన్‌ ఆ క్యాలెండర్‌ను ఈ రోజు రిలీజ్‌ చేయనున్నారు.

ఖాళీగా ఉన్న పోస్టులకు ప్రాధాన్యత ప్రకారం దశలవారిగా ఆర్థికశాఖ ఆమోదంతో విడుతల వారీగా ఆయా ఖాళీలకు పరీక్షలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే నూతన విద్యావిధానం గురించి సీఎం జగన్.. రాష్ట్ర మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories