ఓపెన్ ఏఐ సీటీవో శ్రీనివాస నారాయణన్‌తో మంత్రి లోకేష్ భేటీ

ఓపెన్ ఏఐ సీటీవో శ్రీనివాస నారాయణన్‌తో మంత్రి లోకేష్ భేటీ
x
Highlights

అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్‌తో భేటీ అయ్యారు.

శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ‘‘ఒక కుటుంబంలో ఒక ఏఐ ఆధారిత సభ్యుడు” అనే లక్ష్యాన్ని సాధించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం అని చెప్పారు. ఇందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం తయతో కలిసి పనిచేయమని కోరారు. తొలిదశలో ఏపీలోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులకు ఉచిత చాట్ జీపీటీ అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయమని అడిగారు. డేటా సెంటర్ హబ్ గా మారుతున్న ఏపీని ఓపెన్ ఏఐ డేటా సెంటర్ కార్యకలాపాలకు ఎంపిక చేసుకోవాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఎంటర్ ప్రైజ్ ఏఐ ఇంటిగ్రేషన్ కోసం ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టెక్ దిగ్గజాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఓపెన్ ఏఐ సీటీవో శ్రీనివాస్ నారాయణన్ చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ 180కి పైగా దేశాల్లో వినియోగదారులు, సంస్థలకు సేవలు అందిస్తోందని వివరించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో చర్చిస్తామన్నారు.

ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మతో మంత్రి లోకేష్ భేటీ

ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మ కూనపునేనితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ‘‘ఏపీలో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌ల కోసం ఐటీ మౌలిక సదుపాయాల ఆధునీకరణకు మద్దతు ఇవ్వండి. ఏఐ ఓప్స్ శిక్షణ, ఇంటర్న్ షిప్ లు, ఆర్ అండ్ డి సహకారం కోసం ఏపీ టెక్ అకడమియాతో భాగస్వామ్యం వహించండి. స్కేలబుల్ సాస్ మోడల్స్ ద్వారా ఐటి కార్యకలాపాల నిర్వహణతోపాటు ఏపీలో ఎస్ఎంఈలు, స్టార్టప్‌లను ప్రారంభించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థకు 500+ సంస్థలు కస్టమర్లుగా ఉన్నాయని తెలిపారు. వీటిలో ఫైనాన్స్, హెల్త్‌కేర్, రిటైల్, టెక్నాలజీలో పాటు ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఉన్నట్లు వివరించారు. భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్ లో ప్రధాన కేంద్రాల ద్వారా ఏఐ ఓప్స్, క్లౌడ్ నేటివ్ మానిటరింగ్ లో ఆవిష్కరణలను ముందుకు తెస్తున్నామని తెలిపారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వర్మ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories