Aadhaar Card: మీరు ఆధార్‌కార్డుని ఎన్నిసార్లు అప్‌డేట్‌ చేశారు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

How Many Times Have you Updated Aadhaar Card Know Complete Details
x

Aadhaar Card: మీరు ఆధార్‌కార్డుని ఎన్నిసార్లు అప్‌డేట్‌ చేశారు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Highlights

Aadhaar Card: దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి.

Aadhaar Card: దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. లేదంటే చాలా ప్రయోజనాలు కోల్పోతాడు. ముఖ్యంగా ప్రభుత్వ సౌకర్యాలు పొందలేడు. చాలామంది ఆధార్ కార్డు జారీ అయిందంటే ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. దీనికి కూడా యూఐడీఏఐ (ఆధార్‌ జారీచేసే సంస్థ) నిబంధనలు జారీచేసింది. వీటి ప్రకారమే ఆధార్‌ అప్‌డేట్‌ జరుగుతుంది.

ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, పేరు, చిరునామా మార్చవచ్చు. కానీ మార్పు చేయడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. UIDAI ఏదైనా ఆధార్ కార్డ్ హోల్డర్ కోసం చిరునామాను మార్చడానికి పరిమితిని నిర్ణయించింది. ఆధార్‌లోని వివరాలను ఎలా, ఎన్నిసార్లు అప్‌డేట్ చేయవచ్చో దానికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం. ముందుగా ఆన్‌లైన్ సేవలను యాక్సెస్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరం. మొబైల్ నంబర్ అప్‌డేట్ లేకుంటే సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం (ASK) లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అప్‌డేట్ సెంటర్‌ను సందర్శించాలి.

1. నిర్బంధ బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం

2. డెమోగ్రాఫిక్ అప్‌డేట్ (ఏదైనా రకం) రూ. 50/- (GSTతో కలిపి)

3. బయోమెట్రిక్ అప్‌డేట్ రూ. 100/- (GSTతో కలిపి)

4. బయోమెట్రిక్ విత్ డెమోగ్రాఫిక్ అప్‌డేట్ రూ. 100/- (పన్నులతో కలిపి)

5. A4 షీట్‌పై ఆధార్ డౌన్‌లోడ్, కలర్ ప్రింట్-అవుట్ ఒక్కో ఆధార్‌కు రూ.30/- (GSTతో కలిపి).

UIDAI ప్రకారం ఆధార్ కార్డ్ హోల్డర్ తన పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు.

పుట్టిన తేదీ (DOB)ని ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేయవచ్చు. లింగ వివరాలను ఒకసారి మాత్రమే అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఇంతకు మించి చేయాలంటే ప్రత్యేక పర్మిషన్‌ అవసరమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories