Union Budget History: తొలి బడ్జెట్ నుంచి ఇప్పటి వరకు అనేక ఆసక్తికర అంశాలు

Several Interesting Facts Emerges in Union Budget in Last 70 Years
x

Union Budget History: తొలి బడ్జెట్ నుంచి ఇప్పటి వరకు అనేక ఆసక్తికర అంశాలు

Highlights

Union Budget: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంటులో వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

Union Budget: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంటులో వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి సగటు మధ్య తరగతిని ఆకట్టుకునేందుకు భారీగా తాయిలాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈసారి బడ్జెట్ ఎలా ఉండనుందనే అంశాలను పక్కన పెడితే..దేశంలో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. దేశంలో స్వాతంత్ర్యానికి ముందే ప్రవేశపెట్టిన తొలి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో ఓసారి చూద్దాం.

భారత్‌కు స్వాతంత్ర్యం రావడానికి ముందే..1860లో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పొలిటీషియన్, ఏకానమిస్ట్ జేమ్స్ విల్సన్ మొట్టమొదటి బడ్జెట్‌ను బ్రిటిష్ క్రౌన్‌కు 7 ఏప్రిల్, 1860న ప్రతిపాదించారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం మొట్ట మొదటిసారి 1947, నవంబర్ 26న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముకం శెట్టి ప్రవేశపెట్టారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రులు ప్రవేశపెడతారు. అయితే కొద్ది మాత్రమే..ఎక్కువ కాలం ఆ పదవుల్లో కొనసాగడం సహా పలు మధ్యంతర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. అలా మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ 1962 నుంచి 1969 మధ్య ఆర్థిక మంత్రిగా దాదాపు 10సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన తర్వాత పి.చిదంబరం తొమ్మిదిసార్లు, ప్రణబ్‌ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్‌ సిన్హా 8సార్లు, మన్మోహన్ సింగ్ ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు 4సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఐదోసారి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు దేశ తొలి ప్రధాన మంత్రి జవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ప్రధానిగా బాధ్యతలు చేపడుతూనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం ప్రవేశపెట్టేవారు 1999లో ఆ సంప్రదాయాన్ని మార్చి 1ఉదయం 11 గంటలకు మార్చారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకు మళ్లీ బడ్జెట్ సమయాల్లో మార్పు చేశారు. 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 28కి బదులుగా ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు..కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టేది. 2017 వరకు ఈ సంప్రదాయం కొనసాగింది. అయితే మోదీ..నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం..దానిని 2017లో విలీనం చేసింది. ఫిబ్రవరి 1నే రైల్వేతో పాటు అన్ని రంగాలకు బడ్జెట్‌ కేటాయింపులు ప్రకటిస్తోంది. సంప్రదాయం ప్రకారం నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వశాఖలో హల్వా వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకతోనే బడ్జెట్ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత బడ్జెట్‌ ప్రతులను ముద్రిస్తారు. అవి పార్లమెంటులోకి చేరే వరకు ఇందులో భాగమైన వారంతా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు.

అయితే..2021లో ఈ సంప్రదాయానికి తెరదించారు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. 2021, ఫిబ్రవరి 1న మొట్ట మొదటి సారిగా పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పార్లమెంటు సభ్యులతో పాటు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా బడ్జెట్ యాప్ సైతం తీసుకొచ్చారు. 2019 వరకు ఆర్థికశాఖ మంత్రులందరూ తాము ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేసులో తీసుకురావడం ఆనవాయితీగా వచ్చేది. అయితే ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ మాత్రం ఎర్ర రంగు ఉన్న బహి ఖాతాలో బడ్జెట్‌ను తీసుకొస్తున్నారు. బహి ఖాతా అంటే అకౌంట్స్ బుక్ అని అర్థం. దీనిమీద జాతీయ చిహ్నం ముద్రించి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories