Indian Army Recruitment 2023: ఇండియన్‌ ఆర్మీలో గ్రూప్‌ సి పోస్టులు.. పదో తరగతి అర్హత..!

Indian Army Group C Recruitment 2023 Check for all Details
x

Indian Army Recruitment 2023: ఇండియన్‌ ఆర్మీలో గ్రూప్‌ సి పోస్టులు.. పదో తరగతి అర్హత..!

Highlights

Indian Army Recruitment 2023: ఇండియన్‌ ఆర్మీ నుంచి గ్రూప్‌ సి పోస్టుల నోటిఫికేషన్‌ విడుదలైంది.

Indian Army Recruitment 2023: ఇండియన్‌ ఆర్మీ నుంచి గ్రూప్‌ సి పోస్టుల నోటిఫికేషన్‌ విడుదలైంది. పదో తరగతి మాత్రమే అర్హత. ఆసక్తి గల అభ్యర్థులు 11 ఫిబ్రవరి 2023 లోపు అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌లో కుక్, బార్బర్, టైలర్, డ్రాఫ్ట్స్‌మన్, మెసెంజర్, సఫాయివాలా పోస్టులని భర్తీ చేస్తారు. ఆఫ్‌లైన్‌ విధానంలో మాత్రమే అప్లై చేయాలి.

1. కుక్ - 10వ తరగతి పాసవ్వాలి. భారతీయ వంటలు, వాణిజ్యంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

2. బార్బర్‌- 10వ తరగతి పాసవ్వాలి.

3. టైలర్- గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణత సాధించాలి. ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌లో టైలర్‌గా 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

4. మెసెంజర్, దఫ్తారీ, సఫాయివాలా - అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది.

అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు మించరాదు. జీతం గురించి మాట్లాడుకుంటే కుక్ పోస్టుకు నెలకు రూ.19900 నుంచి రూ.63200 ఉంటుంది. బార్బర్, టైలర్ పోస్టులకు నెలకు రూ.18000 నుంచి రూ.56900 వరకు లభిస్తుంది. మరోవైపు మెసెంజర్, డ్రాఫ్టీ, సఫాయివాలా పోస్టులకు నెలకు రూ.18000 నుంచి రూ.56900 వరకు లభిస్తుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

దరఖాస్తు ఫారమ్‌ అన్ని విధాలుగా నింపి ఎన్వలప్ లెటర్‌లో(పరిమాణం 23 సెం.మీ. X 10 సెం.మీ. కంటే తక్కువ కాకుండాక) తగిన స్టాంప్‌తో అన్ని సంబంధిత ధృవీకరణ కాపీలు, 10వ తరగతి సర్టిఫికేట్ లేదా మార్కుల మెమో జత చేసి స్పీడ్‌ పోస్ట్‌ చేయాలి. "సెలక్షన్ బోర్డ్ GP 'C' పోస్ట్ జాక్ రైఫిల్ రెజిమెంటల్ సెంటర్ జబల్పూర్ CANTT PIN 482001"కి పంపాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories