ఇంజనీరింగ్‌ పీజీ చేసిన వారికి గుడ్‌న్యూస్‌.. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో 182 ఉద్యోగాలు..!

NTRO Notification 2023 Apply for 182 Jobs Check for all Details
x

ఇంజనీరింగ్‌ పీజీ చేసిన వారికి గుడ్‌న్యూస్‌.. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో 182 ఉద్యోగాలు..!

Highlights

NTRO Jobs 2023: ఇంజనీరింగ్‌ పీజీ చేసిన వారికి ఇది శుభవార్తని చెప్పాలి.

NTRO Jobs 2023: ఇంజనీరింగ్‌ పీజీ చేసిన వారికి ఇది శుభవార్తని చెప్పాలి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO)నుంచి నోటిఫికేషన్‌ను విడుదల అయింది. ఏవియేటర్ II, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ జరగనుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 21గా నిర్ణయించారు. రిక్రూట్‌మెంట్ గురించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 182 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో టెక్నికల్ అసిస్టెంట్ 160, ఏవియేటర్-2 22 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్ష 400 మార్కులకు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కులు కట్‌ అవుతాయి. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఫీజుగా రూ.500 చెల్లించాలి. అదే సమయంలో రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ntro.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 21 జనవరి 2023లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories