Elon Musk: సొంత ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు ఎలాన్ మస్క్ ప్లాన్..

Elon Musk Plans to Have own Airport in Texas
x

Elon Musk: సొంత ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు ఎలాన్ మస్క్ ప్లాన్..

Highlights

Elon Musk: ప్రపంచ సంపన్నుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ సొంతంగా ఓ ఎయిర్‌పోర్టును నిర్మించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Elon Musk: ప్రపంచ సంపన్నుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ సొంతంగా ఓ ఎయిర్‌పోర్టును నిర్మించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరం వెలుపల ఈ ఎయిర్‌పోర్టును నిర్మించే అవకాశాలున్నాయి. ఈ మేరకు అమెరికా మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్, బోరింగ్ కంపెనీ కార్యాలయాలు టెక్సాస్‌లోనే ఉన్నాయి. టెస్లా కూడా డిసెంబర్‌లోనే సిలికాన్ వ్యాలీ నుంచి టెక్సాస్‌కు మార్చారు. తన కంపెనీ కార్యకలాపాల కోసం మస్క్ తరచుగా టెక్సాస్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. అందుకే సొంతంగా ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూములు మస్క్ దగ్గర చాలానే ఉన్నాయి. ఒక్క గిగా టెక్సాస్ కంపెనీ పేరిటే దాదాపు 2,100 ఎకరాల భూమి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories