Immunity: ఈ టిప్స్ పాటిస్తే.. ఇమ్యూనిటీ పెరుగుతోందంటున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ!

Ministry Of Ayush Tips for Immunity Boosting
x

ఇమ్యూనిటి బూస్టర్స్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Immunity Boosting: కరోనా వైరస్ నేపథ్యంలో అందరి దృష్టి రోగ నిరోధక శక్తిపై పడింది.

Immunity Boosting: కరోనా వైరస్ నేపథ్యంలో అందరి దృష్టి రోగ నిరోధక శక్తిపై పడింది. ఏ రోగాల నుంచైనా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ మన ఒంట్లో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు కొన్ని సూచనలు, సలహాలు చేసింది.

కరోనా వైరస్‌‌ తగ్గించేందుకు ఔషదాలు దొరకని నేపథ్యంలో నివారణ ఒక్కటే మార్గమని తెలిపింది. కాబట్టి.. కొన్ని ఇంటి చిట్కాలు పాటించి వాటిద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. అవేంటో చూద్దాం...

ప్రతిరోజూ ఇలా చేయండి:

  • రోజంతా గోరు వెచ్చిని నీళ్లు తాగండి.
  • ప్రతిరోజూ యోగాసనాలు వేయాలి.
  • కనీసం 30 నిమిషాలపాటు ప్రాణాయామం, ధాన్యం చేయాలి.
  • ఆహారంలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లులి తప్పక ఉండేలా చూడండి.
  • ఉదయం 10 గ్రాముల చ్యావన్‌ ప్రష్ తీసుకోండి.
  • మధుమేహ వ్యాధి బాధితులు సుగర్ ఫ్రీ చ్యావన్‌ప్రష్ తీసుకోండి.
  • తులసి, నల్ల మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క, ఎండు ద్రాక్షతో తయారు చేసిన హెర్బల్ టీ తాగండి.
  • హెర్బల్ టీ రుచిగా ఉండేందుకు కాస్త బెల్లం, నిమ్మరసం కలపండి.
  • 150 మిల్లీ లీటర్ల వేడి పాలల్లో అర టీ స్పూన్ పసుపు పొడి కలిపి తాగాలి. దీన్నే గోల్డెన్ మిల్క్ అంటారు. రోజూ రెండు సార్లు ఇలా చేయండి.
  • ఉదయం, సాయంత్రం వేళ్లలో మీ ముక్కు రంథ్రాలకు నువ్వులు లేదా కొబ్బరి లేదా నెయ్యి రాయండి.
  • రోజూ ఒకటి లేదా రెండు సార్లు ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని పుక్కిలించండి.
  • నూనెను ఎట్టి పరిస్థితుల్లో తాగరాదు. 2 లేదా 3 నిమిషాలు పుక్కిలించిన తర్వాత నూనె బయటకు ఊసేసి.. వేడి నీటిలో నోరు శుభ్రం చేసుకోండి.
  • పొడి దగ్గు లేదా గొంతు నొప్పి ఎక్కువగా ఉంటే రోజుకు ఒకసారి నీటిలో పుదినా లేదా వాము వేసుకుని పీల్చండి.
  • దగ్గు లేదా గొంతు గరగర ఎక్కువగా ఉంటే రోజుకు రెండు లేదా మూడు సార్లు లవంగాల పొడిలో తేనె కలుపుని తాగండి.

Ministry Of Ayush Tips for Immunity Boosting

గమనిక: 'ఆయుష్' మంత్రిత్వ శాఖ పేర్కొన్న అంశాలను అలానే అందించాం. మరింత సమాచారం కోసం డాక్టర్లను సంప్రదించండి. ఈ సమాచారానికి 'హెచ్‌ఎంటీవీ' ఎలాంటి బాధ్యత వహించదు. అలాగే ఇది కరోనాను తగ్గించే మందు కాదు. ఇమ్యూనిటీ పెంచేందుకు మాత్రమే అని గమనించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories