Madhavbaug Ayurvedic: మాధవ్‌బాగ్ ఆయుర్వేదం.. సహజ పద్ధతులతో గుండె బ్లాకేజీలకు స్వస్తి

Madhavbaug Ayurvedic: మాధవ్‌బాగ్ ఆయుర్వేదం.. సహజ పద్ధతులతో గుండె బ్లాకేజీలకు స్వస్తి
x
Highlights

Madhavbaug Ayurvedic: గుండె సంబంధిత వ్యాధులు ప్రస్తుతం వృద్ధులకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ఇది ఇప్పుడు 30 ఏళ్ల యువతను కూడా ప్రభావితం చేస్తున్న రుగ్మతగా మారింది.

Madhavbaug Ayurvedic: గుండె సంబంధిత వ్యాధులు ప్రస్తుతం వృద్ధులకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ఇది ఇప్పుడు 30 ఏళ్ల యువతను కూడా ప్రభావితం చేస్తున్న రుగ్మతగా మారింది. ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేని జీవనశైలి కారణంగా గుండె ధమనులలో సైలెంటుగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. చాలా సందర్భాలలో సాధారణ పరీక్షల సమయంలో ఈ బ్లాకేజీల పరిస్థితి బయటపడి, బాధితులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే గుండె బ్లాకేజీలను నయం చేయడానికి పూర్తిగా సహజసిద్ధమైన, శస్త్రచికిత్స అవసరం లేని ఒక మార్గం ఉంటే ఎలా ఉంటుంది?

మాధవ్‌బాగ్‌ ప్రవేశపెట్టిన గుండె బ్లాకేజీలకు ఆయుర్వేదిక్ రివర్సల్ ట్రీట్‌మెంట్ అనేది పురాతన ఆయుర్వేద చికిత్సా విధానాల జ్ఞానాన్ని, ఆధునిక రోగ నిర్ధారణ విజ్ఞానంతో కలిపి అందిస్తున్న ఒక సమగ్ర పరిష్కారం. ఈ సమగ్ర చికిత్స విధానం గుండెను మళ్లీ ఆరోగ్యవంతంగా మారుస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది, శరీరాన్ని లోపలి నుంచి బ్యాలెన్స్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి సంబంధించి మాధవ్‌బాగ్‌ వినూత్న పద్ధతి గురించి వివరంగా చర్చించుకుందాం.

బ్లాకేజీలు అంటే ఏమిటి? ఆయుర్వేదం దీనిని ఎలా చూస్తుంది?

ఆధునిక వైద్యం ప్రకారం.. గుండెకు రక్తాన్ని అందించే కరోనరీ ధమనుల గోడలపై కొవ్వు, కొలెస్ట్రాల్, విషపూరిత పదార్థాలు పేరుకుపోయి ప్లాక్ ఏర్పడినప్పుడు గుండె బ్లాకేజీలు వస్తాయి. ఈ ప్లాక్ పేరుకుపోవడం వల్ల గుండె కండరాలకు రక్త ప్రసరణ పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుకుంటుంది. గుండె బ్లాకేజీల మూల కారణం హృద్రోగం. ఇది మూడు దోషాల మధ్య బ్యాలెన్స్ దెబ్బతినడం, శరీరంలో విషపూరిత వ్యర్థాలు పేరుకుపోవడం, జీర్ణక్రియ బలహీనపడటం, అనారోగ్యకరమైన కొవ్వు కణజాలం పెరగడం వంటి వాటి వల్ల వస్తుంది.

ఆయుర్వేద రివర్సల్ విధానం ప్రయోజనాలు

యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ సర్జరీ వంటి ప్రక్రియల గురించి విన్నప్పుడు చాలామంది రోగులు ఆందోళన చెందుతారు. ఈ ఆపరేషన్లు సమర్థవంతమైనవే అయినప్పటికీ, అవి చాలా ఖరీదైనవి, శారీరకంగా ఇబ్బందికరమైనవి. తరచుగా జీవితాంతం మందులు వాడవలసి వస్తుంది.

ఈ సమస్యలకు పరిష్కారంగా, మాధవ్‌బాగ్‌ సహజ రివర్సల్ థెరపీ ఈ క్రింది ప్రయోజనాలను అందిస్తుంది.

* ఆపరేషన్ రహిత చికిత్స

* మూల కారణానికి చికిత్స

* సహజ డీటాక్స్, పునరుత్తేజం

* గుండె పనితీరులో మెరుగుదల

* దీర్ఘకాలిక జీవనశైలి మార్పు

ఆయుర్వేదం కేవలం అడ్డుకట్టను తొలగించడమే కాకుండా, గుండె, ధమనులను శుద్ధి చేయడానికి, పోషించడానికి, బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. తద్వారా శరీరం సహజంగా నయం అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.

మాధవ్‌బాగ్‌ పద్ధతి

మాధవ్‌బాగ్‌ గుండె బ్లాకేజ్ రివర్సల్ ప్రోగ్రామ్ ప్రధాన బలం దాని సమగ్ర విధానం. ఇది సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సలను అత్యాధునిక రోగ నిర్ధారణ టెక్నాలజీతో కలుపుతుంది, దీని వలన చికిత్స ఫలితాలు పూర్తిగా సురక్షితమైనవిగా ఉంటాయి. చికిత్స దశలు ఇలా ఉంటాయి:

* సమగ్ర గుండె, రోగనిర్ధారణ పరీక్ష: రోగికి ఈసీజీ, 2డీ ఎకో, స్ట్రెస్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్ టెస్టింగ్ వంటి సమగ్ర పరీక్షలు చేస్తారు. ఇది బ్లాకేజీల స్థాయిని ఖచ్చితంగా తెలుసుకోవడానికి, చికిత్స ప్రణాళికను రూపొందించడానికి సహాయపడుతుంది.

* పంచకర్మ డీటాక్స్ థెరపీ: ఆయుర్వేదంలో శక్తివంతమైన శుద్ధి ప్రక్రియ అయిన పంచకర్మ ద్వారా సిరలు, నరాలలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తారు, ధమనులలో వాపును తగ్గిస్తారు. రక్త ప్రసరణను మెరుగుపరుస్తారు. ఆరోగ్యకరమైన నూనెలతో కూడిన స్నేహనా, స్వేదనా, బస్తి వంటి చికిత్సలు ధమనులను తెరిచి, కొవ్వును మృదువుగా చేస్తాయి.

* గుండె కోసం సాంప్రదాయ మూలికా మందులు: అధిక కొలెస్ట్రాల్, బలహీనమైన జీవక్రియ, గుండె కణజాలం బలహీనత, రక్త ప్రసరణ సమస్యలను లక్ష్యంగా చేసుకుని ఈ మూలికా మందులు ఉపయోగిస్తారు. ఇవి యాంటీఆక్సిడెంట్లు, సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లతో నిండి ఉంటాయి.

* గుండెకు అనుకూలమైన ఆయుర్వేద ఆహారం (రివర్సల్ డైట్ కిట్): ఆహారాన్ని ఔషధంగా ఉపయోగిస్తూ, అధిక ఫైబర్, తక్కువ సోడియం, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్న ఆహారాలపై దృష్టి పెడతారు. ఇది లిపిడ్ మెటబాలిజానికి సహాయపడుతుంది.

* జీవనశైలిలో మార్పులు: దీర్ఘకాలిక మార్పుల కోసం రోగులకు వారి శారీరక స్థితికి సరిపోయే వ్యాయామాలు, ప్రాణాయామం వంటి శ్వాస పద్ధతులు, ఒత్తిడి నిర్వహణ కోసం ధ్యానం.ఆరోగ్య సాధనాలతో పురోగతిని ట్రాక్ చేయడంపై శిక్షణ ఇస్తారు.

పరిశోధనల మద్దతుతో ప్రయోజనాలు

మాధవ్‌బాగ్‌ సమగ్ర చికిత్సా విధానం వేలాది మంది రోగులకు ప్రయోజనం చేకూర్చింది. పరిశోధనల మద్దతుతో లభించిన ప్రయోజనాలు:

* బ్లాకేజీలలో తగ్గుదల: 2-3 నెలల నిరంతర చికిత్స తర్వాత రోగులలో 30–60% బ్లాకేజీలు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.

* గుండె పంపింగ్ సామర్థ్యం మెరుగుదల: గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని కొలిచే ఎజెక్షన్ ఫ్రాక్షన్ లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది.

* స్ట్రెస్ టెస్ట్‌లో నెగటివ్ ఫలితాలు: రోగులు సాధారణంగా స్ట్రెస్ టెస్ట్ పాజిటివ్ నుంచి స్ట్రెస్ టెస్ట్ నెగటివ్ కు మారతారు. ఇది మెరుగైన గుండె పనితీరుకు స్పష్టమైన సంకేతం.

* కొలెస్ట్రాల్ తగ్గింపు: హెర్బల్ మందులు, డీటాక్స్ థెరపీ LDL, ట్రైగ్లిజరైడ్స్ వంటి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఎవరికి ఈ చికిత్స ఉత్తమం?

ఈ ఆయుర్వేద రివర్సల్ థెరపీ ముఖ్యంగా తక్కువ నుంచి మధ్యస్థ స్థాయి బ్లాకేజీలు ఉన్నవారు, ఆపరేషన్ లేకుండా చికిత్స కోరుకునేవారు, దీర్ఘకాలిక మందులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకునేవారు, సహజసిద్ధమైన చికిత్సను ఇష్టపడేవారు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం లేదా అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఉత్తమ ఎంపిక.

ఆరోగ్యకరమైన గుండె వైపు మొదటి అడుగు

గుండె ఆరోగ్యం అంటే కేవలం బ్లాకేజీలను తొలగించడం మాత్రమే కాదు, వాటికి కారణమైన అనారోగ్యకరమైన జీవనశైలిని మార్చుకోవడం కూడా. మాధవ్‌బాగ్‌ చికిత్స రోగులకు సహజ వైద్యం, శాస్త్రీయంగా పర్యవేక్షించబడే పురోగతి, దీర్ఘకాలిక జీవనశైలి మార్పులను అందిస్తుంది. మీరు లేదా మీ సన్నిహితులు గుండె బ్లాకేజీలకు సహజసిద్ధమైన, శస్త్రచికిత్స రహిత మార్గాల కోసం చూస్తున్నట్లయితే, ఈ సమగ్ర విధానం ప్రాణాలను రక్షించే ఎంపిక కావచ్చు.

మీరు మాధవ్‌బాగ్‌ ఆయుర్వేద హార్ట్ బ్లాకేజ్ రివర్సల్ ట్రీట్‌మెంట్‌లో ఆసక్తి కలిగి ఉంటే సహాయం పొందడానికి భారతదేశం అంతటా 360+ క్లినిక్‌లు, 2 ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. పూర్తి సమాచారం కోనం +91 7400468145,[email protected] లను సంప్రదించండి.

విచారణ సమయం: సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:00 వరకు (ఆదివారం సెలవు)

Show Full Article
Print Article
Next Story
More Stories