ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ 5 ఆహారాలు..! అవేంటంటే..?

These 7 Foods should be Eaten Daily for Lung Health
x

ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ 5 ఆహారాలు(ఫైల్ ఫోటో)

Highlights

* పెరుగుతున్న కాలుష్యం శరీరంలోని ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

Lungs Health: పెరుగుతున్న కాలుష్యం శరీరంలోని ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీంతో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఇందులో పిల్లలు, వృద్దులు అధికంగా ఉంటున్నారు. పెరుగుతున్న కాలుష్యం శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది.

క్రానిక్ బ్రోన్కైటిస్ నుంచి గుండె జబ్బులు, మధుమేహం వరకు సంభవిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారం తినడం అవసరం. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.

1. బెల్లం

ఆయుర్వేదంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు బెల్లం ఎక్కువగా వినియోగిస్తారు. ఇది శ్వాసకోశ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. బెల్లం శ్వాసనాళ కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. శ్వాసను సులభతరం చేస్తుంది. ఊపిరితిత్తులలో గాలి ప్రవాహాన్ని కూడా పెంచుతుంది.

2. చేప

చేపలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిని పాలీ-అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని పిలుస్తారు. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-కార్సినోజెనిక్, యాంటీ-ఆక్సిడేటివ్ గుణాలు కలిగి ఉంటాయి. ఈ లక్షణాలన్నీ ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

3. ఆపిల్

ఒక అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా ఆపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఆపిల్ తినడం వల్ల ఊపిరితిత్తుల పని సామర్థ్యం పెరుగుతుంది. ఇవి ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తాయి.

4. బీట్‌రూట్

బీట్‌రూట్‌ ఊపిరితిత్తుల పనితీరుకు ప్రయోజనకరమైన నైట్రేట్ మూలకాలను కలిగి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బీట్‌రూట్ రక్త నాళాలను సడలించడం, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా బీట్‌రూట్‌లో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

5. వెల్లుల్లి

ఇందులో అల్లిసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఉబ్బసం, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ రుగ్మతలకు తగ్గిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories