Health Tips: పొరపాటున కూడా వీరు వేరుశెనగ తినకూడదు.. ఎందుకంటే..?

These People Should not eat Peanuts Even by Mistake
x

Health Tips: పొరపాటున కూడా వీరు వేరుశెనగ తినకూడదు.. ఎందుకంటే..?

Highlights

Health Tips: వేరుశెనగ తినడానికి అందరు ఇష్టపడుతారు.

Health Tips: వేరుశెనగ తినడానికి అందరు ఇష్టపడుతారు. చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు. వీటిలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటాయి. వేరుశెనగ తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేరుశెనగ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వేరుశెనగ తినడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

సోడియం పెరుగుతుంది..

ప్రస్తుతం మార్కెట్‌లో వేరుశెనగ రుచిని పెంచడానికి ఉప్పుతో పాటు అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. దీంతో బీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు వేరుశెనగ తినకూడదు.

బరువును పెంచుతుంది

కొందరికి వేరుశెనగ అంటే చాలా ఇష్టం కాబట్టి రోజూ తింటారు. వేరుశెనగలో అధిక కేలరీలు ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే వేరుశెనగ తినడం మానుకోండి.

అసిడిటీలో హానికరం

ఎసిడిటీ సమస్య ఉన్నవారు వేరుశెనగ తినకుండా ఉండాలి. వేరుశెనగ తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం మొదలైన సమస్యలు పెరుగుతాయి. అందువల్ల పొరపాటున కూడా వేరుశెనగ తినవద్దు లేదంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే.

Show Full Article
Print Article
Next Story
More Stories