Health Tips: ఈ టీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.. రోజు తాగితే చాలా మేలు..!

This Tea Cleanses the Blood It is Very Good to Drink During the day
x

Health Tips: ఈ టీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.. రోజు తాగితే చాలా మేలు..!

Highlights

Health Tips: కరోనా వల్ల చాలామంది ప్రజలు మారిపోయారు. ఆరోగ్యంపై బాగా దృష్టిపెడుతున్నారు.

Health Tips: కరోనా వల్ల చాలామంది ప్రజలు మారిపోయారు. ఆరోగ్యంపై బాగా దృష్టిపెడుతున్నారు. వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందుగా మనం తినే ఆహారం బాగుండాలి. చక్కటి పదార్థాలని డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో హెర్బల్‌ టీలు కూడా భాగమే. కరోనా కాలంలో చాలామంది హెర్బల్‌ టీలు తాగి రోగనిరోధక శక్తి పెంచుకున్నారు. ఈ టీలు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని అవయవాలకు ఆక్సిజన్ అందుతుంది. ఇవి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం.

కొత్తిమీర, పుదీనా టీ

మీరు కొత్తిమీర, పుదీనా ఆకులతో చేసిన టీని తయారు చేసి తాగవచ్చు. ఒక పాత్రలో 1 గ్లాసు నీళ్లు తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేయాలి. 10 నిమిషాలు మరగబెట్టి టీ లాగా గోరువెచ్చగా తాగాలి.

తులసి టీ

రోజూ 8 నుంచి 10 తులసిఆకులు తింటే రక్తం శుద్ది అవుతుంది. మీరు ఉదయం, సాయంత్రం టీలో తులసి ఆకులను ఉపయోగించవచ్చు. తులసి టీ చేయడానికి ఒక గ్లాసు నీటిలో 10-15 తులసి ఆకులను వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని ఫిల్టర్ చేసి టీ లాగా తాగితే సరిపోతుంది.

లెమన్ టీ

నిమ్మకాయలో ఉండే అసిడిక్ గుణాలు రక్తంలోని మలినాలని తొలగిస్తాయి. రోజూ ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ పిండుకొని తాగాలి.

అల్లం, బెల్లం టీ

బెల్లం శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ని బయటకు పంపుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. బెల్లం, అల్లం టీ కోసం 1 పెద్ద కప్పు నీటిలో కొద్దిగా అల్లం ముక్క, తర్వాత చిన్న బెల్లం ముక్క కలిపి 5-6 నిమిషాలు స్టవ్‌పై మరిగించి తర్వాత వడగట్టి తాగాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories