Best Wireless Earbuds: తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న ఇయర్‌బడ్‌లు..!

Check These 5 Best Wireless Earbuds Under Price rd. 2000 in India
x

తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న ఇయర్‌బడ్‌లు..!

Highlights

Best Wireless Earbuds: తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న ఇయర్‌బడ్‌లు..!

Best Wireless Earbuds: ఈ రోజుల్లో వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లకు చాలా క్రేజ్ పెరిగింది. మీరు కూడా సరసమైన ధరలో వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, రూ. 2000లోపు 5 ఉత్తమ ఇయర్‌బడ్‌ల జాబితాను ఓసారి పరిశీలించి, ఉత్తమమైనదాన్ని ఎంచుకోండి.

1. డిజో బడ్స్ Z: ధర ₹ 1,599..

ఫ్లిప్‌కార్ట్‌లో డిజో బడ్స్ Z ధర రూ. 1599గా ఉంది. ఇది చాలా ఆకర్షణీయంగా కనిపించే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఇయర్‌బడ్‌లు 4.5 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయని, ఛార్జింగ్ కేస్ ద్వారా దీన్ని 16 గంటలకు పెంచవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది మాత్రమే కాదు, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌లో 1.5 గంటలు వాడుకోవచ్చని పేర్కొంది. వీటికి IPX4 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తోపాటు స్మార్ట్ టచ్ కంట్రోల్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, 10 mm డైనమిక్ డ్రైవర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2. బోట్ ఎయిర్‌డోప్స్ 121v2: ధర ₹ 1,299..

బోట్‌లోని ఈ ఇయర్‌పాడ్‌లు అల్ట్రా-లైట్ వెయిట్ డిజైన్‌తోపాటు 380mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఇది గరిష్టంగా 14 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. దీని ఛార్జింగ్ కేస్‌లో 380mAh బ్యాటరీ కూడా ఉంది. వీటిని ఛార్జ్ చేయడానికి 2 గంటలు పడుతుంది. ఛార్జింగ్ కేస్‌పై బ్యాటరీ కోసం LED సూచిక కూడా ఉంది. వీటిలో బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, 8ఎమ్ఎమ్ డైనమిక్ డ్రైవర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

3. నాయిస్ ఎయిర్ బడ్స్: ధర ₹ 1,999..

నాయిస్ ఎయిర్ బడ్స్ ధర రూ. 1999తో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన ఇయర్‌బడ్‌ల మాదిరిగా కాకుండా, ఇవి 13mm స్పీకర్ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. ఇది మీకు అద్భుతమైన సంగీత అనుభూతిని ఇస్తుంది. వీటిలో 20 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తున్నాయి. సింపుల్ డిజైన్, IPX4 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఉన్నాయి. ఇందులో ఇచ్చిన టచ్ కంట్రోల్స్ ద్వారా మీరు వాల్యూమ్, కాల్స్, సంగీతాన్ని నియంత్రించవచ్చు.

4. CROSSBEATS Neobuds: ధర ₹ 1,899..

ఇందులో 10mm డైనమిక్ ఆడియో డ్రైవర్‌ అందించారు. ఈ ఇయర్‌బడ్‌లు 40 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. ఇది డిజిటల్ నాయిస్ క్యాన్సిలేషన్, గేమింగ్ మోడ్, ప్రెజర్ ఫ్రీ టచ్ కంట్రోల్‌లను అందిస్తంది. వీటిలో 4 బిల్ట్-ఇన్ మైక్రోఫోన్‌లు ఉన్నాయి. దీంతో మాట్లాడేటప్పుడు అంతరాయం కలగ కుండా ఉంటుంది.

5. Quantum SonoTrix X బ్లూటూత్ TWS: ధర ₹999..

Quantum Sonotrix X ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు గరిష్టంగా 5 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయి. వీటితో 700mAh ఛార్జింగ్ కేస్ అందుబాటులో ఉంది. ఇది ఛార్జ్ చేయడానికి 2 గంటలు పడుతుంది. అయితే ఇయర్‌బడ్‌లు 1 గంట 6 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ అవుతాయని కంపెనీ తెలిపింది. ఇది బ్లూటూత్ వెర్షన్ 5.0ని కలిగి ఉంది. 10 మీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్, iOSతో కనెక్ట్ అవుతుంది. ఇది IPX5 రేటింగ్‌ను కలిగి ఉంది. టచ్ కంట్రోల్స్, వాయిస్ అసిస్టెంట్‌తో వచ్చే ఈ ఇయర్‌బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా కలిగి ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories