Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..

Macherla Niyojakavargam Movie Review In Telugu
x

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..

Highlights

2021 లో మూడు సినిమాల కనిపించిన నితిన్ చెక్ మరియు రంగ్ దే సినిమాలతో పెద్దగా మెప్పించలేకపోయినప్పటికీ, "మేస్ట్రో" సినిమాతో పర్వాలేదనిపించారు.

చిత్రం: మాచర్ల నియోజకవర్గం

నటీనటులు: నితిన్, కృతి శెట్టి, క్యాథరిన్ తెరెసా, సముతిరఖని, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, జయప్రకాష్ తదితరులు

సంగీతం: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ళ

నిర్మాత: సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి

దర్శకత్వం: ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి

బ్యానర్: శ్రేష్ట్ మూవీస్

విడుదల తేది: 12/08/2022

2021 లో మూడు సినిమాలలో కనిపించిన నితిన్ చెక్ మరియు రంగ్ దే సినిమాలతో పెద్దగా మెప్పించలేకపోయినప్పటికీ, "మేస్ట్రో" సినిమాతో పర్వాలేదనిపించారు. తాజాగా ఇప్పుడు కొత్త డైరెక్టర్ ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో "మాచర్ల నియోజకవర్గం" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. "ఉప్పెన" సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కేథరిన్ తెరెసా కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ అనగా ఆగస్టు 12, 2022 న విడుదలైంది.

కథ:

రాజప్ప (సముద్రఖని) మాచర్ల టౌన్ లో అందరినీ బెదిరిస్తూ తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. అపోజిషన్ వాళ్ళని ఎన్నికల లో కూడా పాల్గొననివ్వకుండా ప్రతి సారి తనే యునానిమాస్ గా గెలుస్తూ ఉంటాడు. కానీ యంగ్ మరియు డైనమిక్ ఐ ఏ ఎస్ ఆఫీసర్ అయిన సిద్దు (నితిన్) మాచర్ల లో పరిస్థితులు మార్చాలని నిర్ణయించుకుంటాడు. రాజప్ప ను సిద్దు ఎలా ఎదుర్కున్నాడు? వారిలో ఎవరు గెలిచారు? మరోవైపు స్వాతి (కృతి శెట్టి) అనే అమ్మాయి తన గతాన్ని దాయాలని అనుకుంటూ ఉంటుంది. అసలు ఆమె గతం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

నితిన్ నటన ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా మారింది. తన పాత్రలో ఒదిగిపోయి నితిన్ చాలా బాగా నటించారు. కృతి శెట్టి కూడా అందంతో మాత్రమే కాక అభినయం తో కూడా మెప్పించింది. ఈమె పాత్రకి అంత ప్రాధన్యత లేకపోయినప్పటికీ తన పరిధి మేరకు బాగానే నటించింది. ఇక కేథరిన్ తెరిసా తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి తన పాత్రలో చాలా బాగా నటించింది. ముఖ్య విలన్ పాత్రలో సముద్రఖని కూడా మంచి మార్కులు వేయించుకున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా సినిమాకి బాగానే వర్కౌట్ అయింది. మురళి శర్మ తన నటనతో బాగానే ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

మొట్టమొదటి సినిమా అయినప్పటికీ దర్శకుడు ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి సినిమా కథని బాగానే ఎక్జిక్యూట్ చేశారని చెప్పుకోవచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ దట్టించి సినిమాని బాగానే తెరకెక్కించారు కానీ కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం సినిమాకి నెగటివ్ గా మారింది. తన నెరేషన్ పరంగా కూడా డైరెక్టర్ అంచనాలను అందుకోలేదని చెప్పాలి. ఇక స్క్రీన్ ప్లే కూడా బాగా స్లో అవ్వడంతో కథను బలవంతంగా ముందుకు నడిపినట్లు అనిపిస్తుంది. అనవసరమైన కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తాయి. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం సినిమాకి బాగానే ప్లస్ అయింది. ఒకటి రెండు పాటలు కూడా చాలా బాగున్నాయి. ప్రసాద్ మురెళ్ల సినిమాకి మంచి విజువల్స్ అందించారు. ఎడిటింగ్ పరవాలేదు అనిపిస్తుంది.

బలాలు:

జాతర ఫైట్ సీన్

రాను రాను అంటూనే పాట

బలహీనతలు:

రొటీన్ కథ

ఫస్ట్ హాఫ్

కామెడీ మరీ ఎక్కువ అవ్వడం

చివరి మాట:

సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కావాలని కామెడీ తో నింపేసారు కానీ చాలా వరకు కామెడీ అసలు వర్క్ అవుట్ అవ్వలేదు. చాలా కామెడీ సన్నివేశాలు ఓవర్ గా అనిపించడంతో ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ఇక ఇంటర్వల్ కూడా అనుకున్న విధంగానే సాగుతుంది. ట్విస్ట్ లు కూడా లేకపోవడంతో ప్రేక్షకులకు ఆసక్తి పోతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది. హీరో విలన్ మధ్య సన్నివేశాలు కూడా ఏమాత్రం బాగాలేదు. సినిమాలో మాస్ కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. క్లైమాక్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్ గా మారింది. ఓవరాల్ గా "మాచర్ల నియోజకవర్గం" కేవలం కొంతమంది మాస్ ప్రేక్షకులను మాత్రమే మెప్పించగల రొటీన్ సినిమా.

బాటమ్ లైన్:

"మాచర్ల నియోజకవర్గం" లో ప్రేక్షకులకు ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories