Pushpa Movie: సమంతతో పాటకోసం బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ని తెచ్చిన బన్నీ

Allu Arjun Going to Work With Bollywood Choreographer For Item Song With Samantha in Pushpa Movie
x

సమంతతో పాటకోసం బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ని తెచ్చిన బన్నీ

Highlights

* మళ్లీ అదే బాలీవుడ్ మాస్టర్ తో పని చేయబోతున్న అల్లు అర్జున్

Pushpa Movie: ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో ఐటమ్ సాంగుల హవా బాగానే నడుస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ లు తమ పాటలతో స్టెప్పులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కూడా తన తదుపరి సినిమా లోని ఒక పాట కోసం బాలీవుడ్ మాస్టర్ ని ఎంపిక చేశారట. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప" సినిమా లోని మొదటి పార్ట్ "పుష్ప: ది రైజ్" వచ్చే నెల డిసెంబర్ డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సమంత ఒక ఐటం సాంగ్ లో బన్నీతో కలిసి స్తెప్పులెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ పాట షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది. ఈ షూటింగ్ కోసం చిత్ర బృందం ఒక మాస్ సెట్ ని కూడా ఏర్పాటు చేసింది. అల్లు అర్జున్ ఈ పాట కోసం ఫేవరెట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ను తెచ్చుకున్నారు. ఇంతకుముందు డిజె సినిమాలోని 'గుడిలో బడిలో' పాట కి ఆయన కొరియోగ్రాఫర్గా పనిచేశారు. మళ్లీ చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ తో కలిసి పని చేయబోతున్నారు ఈ బాలీవుడ్ కొరియోగ్రాఫర్. ఇక ఈ పాట మీద కూడా భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories